AP News | ఎన్నికల ప్రచారంలో అపశృతి.. తొలిరోజే సొమ్మసిల్లి పడిపోయిన టీడీపీ అభ్యర్థి
AP News | టీడీపీ ఎన్నికల ప్రచారంలో అపశృతి చోటుచేసుకుంది. శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి పల్లె సింధూర రెడ్డి స్పృహతప్పి పడిపోయారు. మొదటి రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా కొత్తచెరువు మండల కేంద్రానికి సింధూర వచ్చారు.
AP News | టీడీపీ ఎన్నికల ప్రచారంలో అపశృతి చోటుచేసుకుంది. శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి పల్లె సింధూర రెడ్డి స్పృహతప్పి పడిపోయారు. మొదటి రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా కొత్తచెరువు మండల కేంద్రానికి సింధూర వచ్చారు. అదే రోజు ప్రచారం మొదలుకావడంతో పల్లె సింధూరకు ఘనస్వాగతం పలికేందుకు టీడీపీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశారు. భారీ ర్యాలీ నిర్వహించి.. పెద్ద ఎత్తున బాణసంచా పేల్చారు. అలాగే సింధూరకు పూల మాలలు వేసి.. దారి పొడవునా పూలు జల్లారు.
ఒకవైపు ర్యాలీకి భారీగా వచ్చిన జనం.. మరోవైపు బాణసంచా కాల్చిన వాసన, మెడలో పూల దండలు.. దీనికి తోడు ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో సింధూరకు ఊపిరాడలేదు. శ్వాస సక్రమంగా అందకపోవడంతో ర్యాలీలోనే సొమ్మసిల్లి పడిపోయింది. అది గమనించిన భర్త కృష్ణ కిశోర్ రెడ్డి ఇతర మహిళా కార్యకర్తల సహాయంతో ఆమెను వాహనంలో నుంచి దింపి కారులో ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగానే ఉందని టీడీపీ శ్రేణులు తెలిపాయి.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Power Supply | విద్యుత్ సరఫరా అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం
Randhir Jaiswal: అమెరికా టెంపుల్ ఘటనపై భారత్ ఆందోళన
Shai Hope | వరసగా ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డులు.. ‘అమ్మో.. ఇన్ని ఎలా?’ అని తలపట్టుకున్న విండీస్ కెప్టెన్..!
Actor Brahmaji | ప్రజా ఉద్యమాలపై బ్రహ్మాజీ సెటైరికల్ పోస్ట్.. ట్రోలింగ్ తర్వాత క్లారిటీ!
Marri Janardhan Reddy | ఎన్హెచ్ఎం ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలి : మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

