TTD | తిరుపతి లడ్డూ ధరలు తగ్గించాలని భక్తుల రిక్వెస్ట్.. టీటీడీ ఈవో రియాక్షన్ ఇదీ!
TTD | తిరుమలలో శ్రీవారి లడ్డూ ప్రసాదాల (Laddu Prasadam) ధరలను ఎట్టి పరిస్థితుల్లో తగ్గించేది లేదని టీటీడీ ఈవో ధర్మారెడ్డి అన్నారు.
తిరుమల : తిరుమలలో శ్రీవారి లడ్డూ ప్రసాదాల (Laddu Prasadam) ధరలను ఎట్టి పరిస్థితుల్లో తగ్గించేది లేదని టీటీడీ ఈవో ధర్మారెడ్డి (EO Dharmareddy) అన్నారు. లడ్డూ బరువు, పరిమాణం ఏ మాత్రం తగ్గలేదని, రేటు తగ్గించడానికి అవకాశం లేదని స్పష్టం చేశారు. తిరుమల అన్నమయ్య భవనంలో నిర్వహించిన డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో భక్తులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు.
శ్రీవారిని దర్శించుకున్న ప్రతి భక్తుడికి ఒక ఉచిత లడ్డూ అందిస్తున్నామని, బ్రహ్మోత్సవాలు (Brahomottsavam) , వైకుంఠ ఏకాదశి తదితర పర్వదినాల్లో తప్ప, మిగిలిన సమయంలో భక్తులు కావాలసినన్ని లడ్డూలు పొందవచ్చని సూచించారు. యువకులైన శ్రీవారి సేవకులు క్యూ లైన్లు, శ్రీవారి ఆలయంలో భక్తులకు సేవలందించేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
తిరుమలలో భక్తులు సేవలందించేందుకు ప్రస్తుతం ఉన్న 65 సంవత్సరాల పరిమితిని 60 సంవత్సరాలకు కుదించాలని చేసిన సూచనను తిరస్కరిస్తూ 60 ఏళ్ల వారు సక్రమంగా సేవలందించగలరని పేర్కొన్నారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఆన్లైన్లో అడ్వాన్స్ బుకింగ్ ద్వారా దర్శనం, సేవా టికెట్లు పొందిన భక్తులకు వసతి అందుబాటులోకి వస్తుందని ఆయన వెల్లడించారు. 50 సంవత్సరాల క్రితం నిర్మించిన సప్తగిరి విశ్రాంతి గృహాలను ఆధునీకరిస్తామని చెప్పారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘నీటి వనరుల సంరక్షణతో ప్రత్యామ్నాయ పంటల సాగు చేపట్టాలి’
POCSO | స్కూల్లో పరిచయమై పెళ్లి పేరుతో మోసం.. పాపకు జన్మనిచ్చిన బాలిక.. యువకుడిపై పోక్సో కేసు
Baby Food | ఆరు నెలల్లోపు పిల్లల ఆహారంలో వీటిని కలుపొద్దు : FSSAI
వలసదారులకు జేఎస్పీడబ్ల్యూ ఆధ్వర్యంలో అన్నదానం
Abhijeet Dipke | అభిజీత్ దీప్కేకు కండిషనల్ బెయిల్ మంజూరు.. శాంతి ఒప్పందంపై సంతకం చేస్తేనే
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

