తిరుమల: గో ఆధారిత వ్యవసాయం చేస్తున్న రైతులకు రాష్ట్ర రైతు సాధికారిక సంస్థ ద్వారా గోవులు, ఎద్దులు ఉచితంగా ఇవ్వడానికి తగిన ఏర్పాట్లు చేయాలని టీటీడీ ఈవో జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన ఆవు, దూడకు పసుపు, కుంకుమ, పూలమాలలు, నూతన వస్త్రాలు సమర్పించి శాస్త్రోక్తంగా పూజ చేశారు. అనంతరం గోవు, దూడకు దాణా,గ్రాసం అందించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ..తిరుపతి, పలమనేరు గోశాలల నుంచి సుమారు 330 గోవులు, ఎద్దులు రైతులకు ఉచితంగా అందించినట్లు తెలిపారు. రైతులు ఉచితంగా అందుకున్న గోవులు, ఎద్దుల పోషణకు సంబంధించి మార్గదర్శకాలు తయారుచేసి రైతులకు వివరించాలని చెప్పారు.