Manchu Manoj | తిరుపతి నుంచి వెళ్లిపోవాలని మంచు మనోజ్‌కు పోలీసుల వార్నింగ్
Manchu Manoj | ప్రముఖ సినీ నటుడు మంచు మోహన్‌బాబు ఫ్యామిలీలో వివాదాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి.
అమరావతి : ప్రముఖ సినీ నటుడు మంచు మోహన్‌బాబు ఫ్యామిలీలో వివాదాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. నిన్న తిరుపతిలోని మోహన్‌బాబుకు చెందిన వర్సిటీకి (Mohan babu Versity) మంచు మనోజ్ (Manchu Manoj ) రావడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన విషయం తెలిసిందే. చివరకు పోలీసులు జరిపిన చర్చలతో మంచు మనోజ్ తన తాత, నాయనమ్మ సమాధుల వద్ద నివాళి అర్పించి వెళ్లిపోవడంతో పరిస్థితి సద్దు మణిగింది.
అయితే తనపై, తన భార్య మౌనికపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడులకు పాల్పడ్డారంటూ చంద్రగిరి పోలీసు స్టేషన్లో (Police station) మంచు మనోజ్ గురువారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మనోజ్‌కు పోలీసులు పలు సూచనలు చేశారు. శాంతి భద్రతల దృష్ట్యా తిరుపతి నుంచి వెళ్లిపోవాలని తెలిపారు.
అనంతరం ఆయన పోలీసు స్టేషన్ ఎదుట మీడియాతో మాట్లాడుతూ ఎవరితో గొడవ పెట్టడానికి రాలేదని, సంక్రాంతి పండుగను కూతురుతో కలిసి జరుపుకుందామని వచ్చానని తెలిపారు. అయితే రెండు రోజుల పాటు తనను పండుగను జరుపుకోకుండా ఆటంకాలు సృష్టించారని మీడియాకు వివరించారు.
తాను తిరుపతికి వస్తున్న సందర్భంగా తన అభిమానులు ఏర్పాటుచేసిన బ్యానర్లను చించివేయడం, అభిమానులను బెదిరించడం సరికాదని అన్నారు. ఫ్యాన్స్‌ను బెదిరించకుండా ఉంటే సైలెంట్‌గా ఉండేవాడినని తెలిపారు. తన కుటుంబ విషయాలను ముఖ్యమంత్రి చంద్రబాబుతో గాని, మంత్రి నారా లోకేష్, ఎమ్మెల్యే నానికి వివరించ లేదని, సహాయం చేయాలని కూడా ఎవరినీ అడగలేదని వెల్లడించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

