బావిలో జారిపడి పైపులు పట్టుకుని ప్రాణాలు దక్కించుకున్న వృద్దురాలు
ప్రాణాలు దక్కించుకున్న వృద్దురాలు | పొలానికి వెళ్తూ ప్రమాదవశాత్తు జారి వ్యవసాయబావిలో పడిన వృద్ధురాలు సమయస్ఫూర్తితో చాకచక్యంగా పైపులు పట్టుకొని ప్రాణాలు దక్కించుకుంది. వృద్ధురాలి కేకలు విన్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకొని ఆమెను రక్షించారు.

అమరావతి : పొలానికి వెళ్తూ ప్రమాదవశాత్తు జారి వ్యవసాయబావిలో పడిన వృద్ధురాలు సమయస్ఫూర్తితో చాకచక్యంగా పైపులు పట్టుకొని ప్రాణాలు దక్కించుకుంది. వృద్ధురాలి కేకలు విన్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకొని ఆమెను రక్షించారు.
ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూర్ జల్లా రేణిగుంట మండలం అత్తూరు గ్రామంలో ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన వృద్దురాలు సుబ్బమ్మ (80) పొలానికి వెళ్తూ కాలుజారి వ్యవసాయ బావిలో పడింది. వెంటనే తేరుకొని మోటర్ పైపులను పట్టుకుని కేకలు వేసింది.
సమీపంలోని వారు గుర్తించి గాజులమండ్యం పోలీసులకు సమాచారం అందించారు. కానిస్టేబుళ్లు మహేశ్, శివకుమార్ నిమిషాల్లో ఘటనాస్థలానికి చేరుకొని మంచాన్ని బావిలోకి దింపి ఆమెను రక్షించారు.
80 ఏండ్ల వయసులోనూ ఎంతో సమయస్ఫూర్తితో వ్యవహరించి ప్రాణాలు దక్కించుకున్న సుబ్బమ్మను స్థానికులు, పోలీసులు అభినందిస్తున్నారు. కానిస్టేబుళ్లకు తిరుపతి ఎస్పీ అప్పలనాయుడు రివార్డులు ప్రకటించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

