Pinnelli Rama Krishna Reddy | పిన్నెల్లికి రెండురోజుల అసెంబ్లీ కస్టడీ..!
Pinnelli Ramakrishna Reddy | ఈవీఎం ధ్వంసం కేసులో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి రెండు రోజుల పోలీస్ కస్టడీ విధిస్తూ మాచర్ల జడ్జి ఆదేశాలు జారీ చేశారు.
Pinnelli Rama Krishna Reddy | ఇటీవల ముగిసిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఈవీఎం ద్వంసం చేసిన కేసులో అరెస్టయిన నెల్లూరు కేంద్ర కరాగారంలో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని రెండో రోజుల పోలీస్ కస్టడీకి అప్పగించేందుకు కోర్టు అనుమతించింది. అదనపు విచారణ కోసం తమ కస్టడీకి అప్పగించాలని పోలీసులు దాఖలు చేసిన అభ్యర్థనకు మాచర్ల కోర్టు జడ్జి అంగీకరించారు. దీంతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు రెండు రోజుల కస్టడీకి తీసుకుని విచారిస్తారు.
గత మే 13న పోలింగ్ సందర్భంగా మాచర్లలోని రెంటచింతల మండలం పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రంలో ఈవీఎంను పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ధ్వంసం చేశారు. అక్కడి నుంచి బయటకు వస్తుండగా సీహెచ్ నాగ శిరోమణి అనే మహిళ నిలదీయడంతో ఆమెను దుర్భాషలాడి హెచ్చరికలు జారీ చేశారు. దీంతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై రెంట చింతల పోలీసులు ఐపీసీలోని 506, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈవీఎంను ధ్వంసం చేయడాన్ని అడ్డుకోబోయిన టీడీపీ ఏజెంట్ నంబూరి శేషగిరిరావుపై పిన్నెల్లి దాడి చేశారు. దీనిపైనా అప్పటి ఎమ్మెల్యే పిన్నెల్లి, మరో 15 మందిపై ఐపీసీలోని 307, 147, 148, 120బీ, 324, రెడ్ విత్ 149 సెక్షన్ల కింద రెంటచింతల పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు.
ఇవి కూడా చదవండి :
Jio | ఓటీటీ బెనిఫిట్ ప్లాన్లు కుదించిన రిలయన్స్ జియో..!
Reliance | 52 వారాల గరిష్టానికి రిలయన్స్.. ఎం-క్యాప్‌లో మరో రికార్డు..!
Motorola Razr 50 Ultra | ప్రీమియం సెగ్మెంట్లో మరో ఫోన్ మోటరోలా రేజర్ 50 ఆల్ట్రా ఆవిష్కరణ..!
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Singireddy Niranjanreddy | రిజర్వాయర్లకు నీటిని తరలించి చూపిస్తాం.. మంత్రి జూపల్లి సవాల్‌ను స్వీకరిస్తున్న: సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
France Protests | ఫ్రాన్స్‌లో నిరసనలు.. భారతీయులకు ఇండియన్ ఎంబసీ కీలక సూచన
సింగరేణి సమస్యలపై కేటీఆర్‌తో ఎంపీ రవిచంద్ర చర్చ
MCD: కాలుష్యంపై చర్చ.. ఢిల్లీ మున్సిపల్ సమావేశాల్లో గందరగోళం
‘ప్రజా వీరుడు పండుగ సాయన్న’
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

