Pawan Kalyan | శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరిస్తున్న ప్రభుత్వం: జనసేనాని
awan Kalyan | ఆంధ్రప్రదేశ్‌లో శాంతి భద్రతలకు (Law and order) విఘాతం కలిగించేలా ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని జనసేనాని పవన్ కల్యాణ్ (Pawan Kalyan) విమర్శించారు. వైసీపీ (YCP) వల్లే రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు.
Pawan Kalyan | ఆంధ్రప్రదేశ్‌లో శాంతి భద్రతలకు (Law and order) విఘాతం కలిగించేలా ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని జనసేనాని పవన్ కల్యాణ్ (Pawan Kalyan) విమర్శించారు. వైసీపీ (YCP) వల్లే రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu naidu) అరెస్టును ఖండించారు. ప్రాథమిక ఆధారాలు చూపకుండా అర్ధరాత్రి వేళ ఏపీలో (Andhrapradesh) అరెస్టులు చేస్తున్నారని వెల్లడించారు. గతంలో విశాఖపట్నంలో కూడా తమపట్ల ఇదే విధంగా ప్రవర్తించారని ఆరోపించారు. టీడీపీ నాయకులు ఇండ్ల నుంచి బయటకు రాకూడదంటే ఎలా అని ప్రశ్నించారు.
వైసీపీ నాయకుల అక్రమాలు, దౌర్జన్యాలను ప్రశ్నించడం తప్పా అని నిలదీశారు. చంద్రబాబుకు మద్దతుగా టీడీపీ నేతలు నిరసనలు చేయడం తప్పా అన్నారు. చంద్రబాబు అరెస్టు కచ్చితంగా రాజకీయ కక్ష సాధింపేనని విమర్శించారు. చంద్రబాబు పట్ల ప్రభుత్వ తీరు దుర్మార్గంగా ఉందన్నారు. ఏ తప్పుచేయని నాయకులపై కూడా హత్య కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఏపీ సీఐడీ పోలీసులు శనివారం ఉదయం నంద్యాలలో అదుపులోకి తీసుకున్నారు. ఆయనను రోడ్డు మార్గంలో విజయవాడకు తరలిస్తున్నారు. మధ్యాహ్నం విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరు పరుచనున్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

