Paritala Ravi | పరిటాల రవి హత్య కేసు.. 18 ఏండ్ల తర్వాత నిందితులకు బెయిల్
Paritala Ravi Murder Case | ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో సంచలన సృష్టించిన మాజీ మంత్రిటీడీపీ నేత పరిటాల రవి హత్య కేసులో ఐదుగురు నిందితులకు హైకోర్ట్ బెయిల్ మంజూర్ చేసింది.
Paritala Ravi Murder Case | ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో సంచలన సృష్టించిన మాజీ మంత్రి, టీడీపీ నేత పరిటాల రవి హత్య కేసులో ఐదుగురు నిందితులకు హైకోర్ట్ నేడు బెయిల్ మంజూర్ చేసింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న పండుగ నారాయణరెడ్డి (ఏ-3), రేఖమయ్య (ఏ-4), రంగనాయకులు (ఏ-5), వడ్డే కొండ (ఏ-6), ఓబిరెడ్డి (ఏ-8)లకు.. 18 ఏండ్ల తర్వాత ఏపీ హైకోర్టు బెయిల్‌ను మంజూరు చేసింది. అనంతపురం జిల్లా పెనుకొండలో 2005 జనవరి 24న పరిటాల రవి హత్య జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసు అప్పట్లో సంచలనం సృష్టించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన మద్దెలచెరువు సూరిని భాను కిరణ్ అనే వ్యక్తి కాల్చి చంపిన విషయం తెలిసిందే.
టీడీపీ ఎమ్మెల్యే పరిటాల రవి హత్య కేసులో ప్రధాన నిందితుడు మద్దెలచెరువు సూరి. తన కుటుంబంలో ఉన్న అందరిని హత్య చేశాడు అన్న కోపంతో పరిటాల రవి చంపాలని నిర్ణయించుకున్నాడు సూరి. ఈ క్రమంలోనే 2005లో పరిటాల రవిని కాల్చి చంపాడు. ఇక పరిటాల రవిని హత్య చేసిన కేసులో జైలు జీవితం గడిపి బెయిల్ మీద బయటకు వచ్చిన సూరిని 2011 జనవరి 4న భాను కిరణ్ కాల్చి చంపాడు. అనంతపురం ఫ్యాక్షన్ పేరు చెప్పగానే ముందుగా గుర్తోచ్చే పేర్లు పరిటాల రవి, మద్దెలచెరువు సూరి, మొద్దు శీను, ఓం ప్రకాశ్, భాను కిరణ్. దీనిపైనే ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2010లో రక్త చరిత్ర అనే సినిమా కూడా తీశాడు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | కేసీఆర్ దీక్షా దివస్ లేకపోతే.. రేవంత్ రెడ్డి సీఎం అయ్యేవాడే కాదు : హరీశ్ రావు
Jagdeep Dhankhar | మాజీ ఉప రాష్ట్రపతి ధంఖర్‌కు.. ఏడాదిపైగా కేటాయించని అధికార నివాసం
తెలంగాణ ప్రజల్లో ఉద్యమ జ్వాలాను రగిలించిన రోజే దీక్ష దివస్ : రవీంద్ర కుమార్
CPI | ‘రూ.10 వేల కోట్లతో తెలంగాణ ఉద్యమకారుల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి..’
Ramayana | ‘రామాయణ’ ఓటీటీ ప్రేక్షకులకు బిగ్ షాక్.. ఇప్పట్లో డిజిటల్ స్ట్రీమింగ్ లేనట్టేనా?
ట్రెండింగ్ వార్తలు
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!

