నేటి నుంచి ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులతో శ్రీవారికి నైవేద్యం

తిరుమల,మే 1:పూర్వం తిరుమల శ్రీవారికి గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన బియ్యం ఇతర ఉత్పత్తులతో నైవేద్యంపెట్టేవాళ్లు.ఈరోజు నుంచి ప్రయోగాత్మకంగా అదే విధానాన్ని అనుసరిస్తున్నారు తిరుమల అర్చకులు. కృష్ణా జిల్లా పినగూడురులంకకు చెందిన రైతు శ్రీ విజయరామ్ సహకారంతో ఈ ప్రక్రియను కొనసాగిస్తామన్నారు. మొదటి దశలో శ్రీవారి నైవేద్యానికి ఉపయోగించే అన్నప్రసాదాల తయారీ, రెండో దశలో శ్రీవారి లడ్డూ, వడ ప్రసాదాల తయారీ, మూడో దశలో వెంగమాంబ అన్నప్రసాద భవనంలో భక్తులకు అందించే అన్నప్రసాదాల తయారీ చేపట్టేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు.

ఇందుకోసం తెలుగు రాష్ట్రాల్లోని రైతులను భాగస్వాములను చేస్తామని, ప్రకృతి వ్యవసాయం ద్వారా దేశీయ బియ్యం రకాలను పండించడంలో శిక్షణ ఇస్తామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. శ్రీవారికి భక్తులు కానుకగా అందించిన వ్యవసాయ భూముల్లోనూ రైతుల సహకారంతో ప్రకృతి వ్యవసాయం చేసేందుకు చర్యలు చేపడతామని ఆయన పేర్కొన్నారు. ఇవాళ్టి నుంచి శ్రీవారికి 365 రోజుల పాటు 365 రకాల దేశీయ వరి వంగడాల బియ్యంతో నైవేద్యం సమర్పించనున్నారు.

Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rajanna Sircilla | చెరువులో మునిగి యువకుడి మృతి.. తండ్రికి దూరమైన ముగ్గురు చిన్నారులు!
భువనగిరి అరోరా కాలేజీలో కలకలం.. విద్యార్థినుల ఫొటోలు, వీడియోలు లీక్.. వైరల్ అవుతున్న ఆడియో కాల్!
Donald Trump | నాకు 8 నోబెల్ శాంతి బహుమతులు రావాల్సింది.. డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసంతృప్తి..!
Earthquake | పనామాలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 7.6 తీవ్రత నమోదు..!
Nara Lokesh | ‘రణబాలి’ ట్రైలర్‌పై నారా లోకేష్ ప్రశంసలు.. విజయ్ దేవరకొండ నటనకు ఫిదా!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

