శ్రీవారి దర్శనానికి ఆఫ్‌లైన్‌లో టోకెన్లు జారీ షురూ..!
offline tokens|కరోనా కారణంగా నిలిపివేసిన శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల జారీని టీటీడీ ఈరోజు నుంచి పునరుద్ధరించింది. శ్రీవారి భక్తులు ఎప్పటి
తిరుమల : కరోనా కారణంగా నిలిపివేసిన శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల జారీని టీటీడీ ఈరోజు నుంచి పునరుద్ధరించింది. శ్రీవారి భక్తులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న సర్వదర్శనం టోకెన్లను ఆఫ్‌లైన్‌లో జారీ చేయడం ప్రారంభించారు. టోకెన్లు పొందిన భక్తులు 16వ తేదీన దర్శనం చేసుకోవాలని అధికారులు వెల్లడించారు. తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం కాంప్లెక్స్, శ్రీ గోవింద రాజ స్వామి సత్రాల్లో ఏర్పాటు చేసిన కౌంటర్ల ద్వారా ప్రతిరోజు 15 వేల సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తామని పేర్కొన్నారు.
కరోనా కారణంగా 2020 మార్చి తర్వాత ఆఫ్‌లైన్‌లో సర్వదర్శనం టోకెన్ల జారీని టీటీడీ నిలిపేసింది. ప్రస్తుతం టీటీడీ ప్రత్యేక ప్రవేశ దర్శనం, వర్చువల్ సేవా, వీఐపీ సిఫార్సులు, ఆన్ లైన్ సర్వదర్శనం టోకెన్లు ఉన్నవారికి మాత్రమే శ్రీవారి దర్శనం కల్పిస్తున్నారు. ప్రతిరోజు 25-30 వేల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకునేలా ఏర్పాట్లు చేశారు.
ఆఫ్‌లైన్‌లో 15 వేల టోకెన్లు జారీ చేస్తుండటంతో నిత్యం శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య 40 వేలు దాటే అవకాశాలు ఉన్నాయి.ఈ రోజు నుంచి సర్వదర్శనం టోకెన్లు జారీ చేయడం పట్ల భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

