సామాన్య భక్తుల కోసం త్వరలోనే ఆఫ్ లైన్లో దర్శనం టోకెన్లు: టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి
తిరుపతి: సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇచ్చేలా త్వరలోనే ఆఫ్ లైన్ ద్వారా దర్శనం టోకెన్ల జారీ ప్రకియ ప్రారంభిస్తామని టీటీడీ చైర్మెన్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. కోవిడ్ కారణంగా ఉద్యోగులు, భక్తుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని విధిలేని పరిస్థితిలో ఆన్ లైన్ ద్వారా సర్వదర్శన టోకెన్లు జారీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

కోవిడ్ వ్యాప్తి చెందుతుందన్న ఆందోళనతో తిరుపతిలో ఆఫ్ లైన్ ద్వారా టోకెన్లు జారీ విధానాన్ని గత ఏడాది సెప్టెంబరు 25 వ తేదీ నుంచి రద్దు చేశామని ఛైర్మన్ వివరించారు. ఆన్ లైన్లో సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తున్నప్పటికీ, అవి గ్రామీణ ప్రాంతంలో ఉన్న సామాన్య భక్తులకు అందడం లేదన్న భావనలో టీటీడీ ఉందన్నారు.
సామాన్య భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా తిరుపతిలో ఆఫ్ లైన్ విధానంలో సర్వదర్శన టోకెన్లు జారీ చేయాలని అనేక సార్లు భావించినా, కోవిడ్ తీవ్రత కారణంగా వాయిదా వేయక తప్పడం లేదని సుబ్బారెడ్డి చెప్పారు. ఫిబ్రవరి 15వ తేదీ నాటికి ఒమిక్రాన్ తీవ్రత తగ్గుముఖం పడుతుందని నిపుణులు చెబుతున్నందువల్ల వారి సూచన మేరకు ప్రస్తుతం ఆన్ లైన్లో ఫిబ్రవరి 15వ తేదీ వరకు సంబంధించిన సర్వదర్శనం టోకెన్లు మాత్రమే జారీ చేస్తున్నామని ఆయన తెలిపారు.
ఫిబ్రవరి 15వ తేదీన కోవిడ్ వ్యాప్తి పరిస్థితిని అంచనా వేసి సర్వదర్శనం టోకెన్లు సామాన్య భక్తులకు సులభతరంగా అందేలా ఆఫ్ లైన్ విధానంలో జారీ చేసే అంశంపై నిర్ణయం తీసుకుంటామని చైర్మన్ సుబ్బారెడ్డి భక్తులకు తెలియజేశారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

