IAS Transfers | ఏపీలో కొత్త సీఎస్ చర్యలు షురూ.. సీఎంవోలో విధులు నిర్వహిస్తున్న ముగ్గురు ఐఏఎస్‌ల బదిలీ
IAS Transfers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి (New Chief Secretary) గా నీరభ్‌కుమార్ ప్రసాద్ బాధ్యతలు చేపట్టిన కొద్ది గంటల్లోనే సీఎంవోలో పనిచేస్తున్న ముగ్గురు ఐఏఎస్ అధికారుల బదిలీలు సంచలనం కలిగిస్తోంది .
అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి (New Chief Secretary) గా నీరభ్‌కుమార్ ప్రసాద్ బాధ్యతలు చేపట్టిన కొద్ది గంటల్లోనే సీఎంవోలో పనిచేస్తున్న ముగ్గురు ఐఏఎస్ అధికారుల బదిలీలు సంచలనం కలిగిస్తోంది . వైసీపీ పాలనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులను కొత్త ప్రభుత్వం అధికారంలోకి రాకముందే వారిని అక్కడి నుంచి బదిలీల ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు.
ముఖ్యంగా ముఖ్యమంత్రి కార్యాలయంలో( సీఎంవో)లో పనిచేస్తున్న ముగ్గురు ఐఏఎస్ (IAS) లను సీఎస్ శుక్రవారం బదిలీ చేశారు. పూనం మాలకొండయ్య (Poonam Malakondaiah) , రేవు ముత్యాలరాజు (Revu Mutyalaraju), నారాయణ్ భరత్ గుప్తా (Narayan Bharat Gupta) ను సాధారణ పరిపాలనశాఖలో రిపోర్టు చేయాలని సీఎస్ ఆదేశాలు జారీ చేశారు.
ఈనెల 4న ఎన్నికల ఫలితాలు వెలువడ్డ తరువాత అత్యధిక మెజారిటీ సాధించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా కలిసేందుకు వెళ్లిన ముగ్గురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను వెనక్కి పంపించేశారు. ఈ ముగ్గురు గత వైసీపీ పాలనలో వైఎస్ జగన్‌కు అంటకాగారని టీడీపీ నాయకులు ఆరోపణలు వ్యక్తం చేశారు. ప్రభుత్వ ప్రధానకార్యదర్శి జవహర్‌రెడ్డిపై మొదటి వేటు పడగా ప్రస్తుతం మరో ముగ్గురు ఐఏఎస్‌లకు బదిలి వేటు పడింది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

