Nagababu | ఏపీలో కూటమి పాలన జరుగకుండా.. అల్లర్లకు ఓ పార్టీ ప్రయత్నం..! నాగబాబు సంచలన ట్వీట్..!
Nagababu | ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వ పాలనను సజావుగా సాగకుండా అడ్డుకునేందుకు ఓ పార్టీ ప్రయత్నిస్తుందని, ఆ పార్టీ ఏదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదని జనసేన నేత నాగబాబు ఆరోపించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు.
Nagababu | ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వ పాలనను సజావుగా సాగకుండా అడ్డుకునేందుకు ఓ పార్టీ ప్రయత్నిస్తుందని, ఆ పార్టీ ఏదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదని జనసేన నేత నాగబాబు ఆరోపించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు. రాష్ట్రంలో గొడవలు, అల్లర్లు, హింసాత్మక ఘటనల కోసం జిల్లాకు రూ.10కోట్ల చొప్పున రాబోయే రెండేళ్ల కాలానికి ఖర్చు పెట్టేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తుందని తమకు సమాచారం అందిందని తెలిపారు. ఆ పార్టీ జిల్లాకి రూ.10కోట్ల చొప్పున 13 ఉమ్మడి జిల్లాలకి రూ.130 కోట్లు.. అదే సంవత్సరానికి రూ.1500కోట్లు ఖర్చుపెట్టే బదులు ఆ డబ్బు సామన్యుల సంక్షేమానికి, చేసిన పాపాలు కడుక్కోవడానికి ఖర్చు పెట్టుంటే కొంతలో కొంతైనా సింపతీ వచ్చేదన్నారు.
ఇలా అల్లర్లు చేసేస్తే తద్వార మధ్యంతర పరిపాలన వచ్చేస్తది అనుకునే పనికిమాలిన ఆలోచనలు మానుకోవాలని హితవు పలికారు. క్రూర వ్వవహారాలేవి మాదాక రావు అనుకోవద్దని. వీటిని ధీటుగా ఎదుర్కొంటామన్నారు. కాకపోతే మీకు నేనిచ్చే ఒక మంచి సలహా ఏంటంటే ఆ హింసాత్మక చర్యలకి పెట్టే ఆ డబ్బుని పేదల కోసం పెడితే వారి పురోగతి కోసం పెడితే కనీసం ఈ సారి ప్రతిపక్ష హోదా అయిన దక్కుదన్నారు. ఇది తన సలహా అని.. పాటిస్తే మంచిదని, పాటించకపోతే కూటమి ప్రభుత్వానికి మీ కుట్రలని ఎలా అరికట్టాలో బాగా తెలుసునని వ్యాఖ్యానించారు.
ఇక నాగబాబు చేసిన ట్వీట్ ప్రతిపక్ష వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్ సీపీ పార్టీనేనని తెలుస్తున్నది. ఇదిలా ఉండగా.. ఏపీలో శాంతిభద్రతలు అదుపు తప్పాయంటూ వైఎస్సార్ సీపీ అధినేత ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఢిల్లీలోలోని జంతర్‌మంతర్‌లో దీక్షకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. 45 రోజుల్లోనే 30కిపైగా హత్యలు జరిగాయని.. దాడుల భయంతో దాదాపు 300 మంది వలస వెళ్లిపోయారన్నారు. ప్రైవేటు ఆస్తులను యథేచ్ఛగా ధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికే 560 మంది ప్రైవేటు వ్యక్తుల ఆస్తులు ధ్వంసమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా? లేదా? అంటూ నిలదీశారు.
కూటమి ప్రభుత్వపు తాలుకు పరిపాలన సజావుగా జరగకుండా ఉండటానికి రాష్ట్రంలో అల్లర్లు,గొడవలు హింసాత్మక సంఘటనలు చేయటానికి ప్రతి జిల్లాకి 10 కోట్ల చొప్పున రాబోయే రెండేళ్ల కాలనికి ఖర్చు పెట్టడానికి ఒక పార్టీ ప్రయత్నిస్తోంది,
అది ఏ పార్టీ అని మీకు చెప్పనక్కర్లేదు,
మాకొచ్చిన సమాచారం ఇది..…— Naga Babu Konidela (@NagaBabuOffl) July 23, 2024
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RTC Bus Fare | కర్ణాటకలో ఆర్టీసీ చార్జీల బాదుడు.. నవంబర్ 5 నుంచి కొత్త రేట్లు!
Trump Warning | 10 నిమిషాల్లో మీ అణుశక్తిని అంతం చేస్తాం’.. ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్
Personal Finance Tips | పొదుపే శ్రీరామరక్ష.. అప్పుల ఊబిలో పడకుండా ఉండేందుకు ఈ పొదుపు అలవాట్లు మొదలుపెట్టండి!
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో ఊహించని ఎలిమినేషన్.. రోహిత్‌కు షాకిచ్చిన హౌస్ మేట్స్ ఓటింగ్..!
Teachers Dress Code | ఇకపై టీచర్లు జీన్స్, టీషర్టులు వేసుకోవద్దు.. బీహార్ సర్కార్ సంచలన ఆదేశాలు!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

