Muchumarri | ముచ్చుమర్రి బాలిక కేసులో అనూహ్య పరిణామం.. లాకప్‌లో నిందితుడి మేనమామ మృతి!
Muchumarri | నంద్యాల జిల్లా ముచ్చుమర్రి బాలిక హత్యాచారం కేసులో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. బాలిక మృతదేహాన్ని మాయం చేయడంలో కీలక పాత్ర పోషించారని భావిస్తున్న ఓ వ్యక్తి మిడుతూరు పోలీస్ స్టేషన్లో అనుమానాస్పదంగా మృతి చెందాడు.
Muchumarri | నంద్యాల జిల్లా ముచ్చుమర్రి బాలిక హత్యాచారం కేసులో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. బాలిక మృతదేహాన్ని మాయం చేయడంలో కీలక పాత్ర పోషించారని భావిస్తున్న ఓ వ్యక్తి మిడుతూరు పోలీస్ స్టేషన్లో అనుమానాస్పదంగా మృతి చెందాడు.
బాలిక మృతదేహం మిస్సింగ్ కేసు విచారణలో భాగంగా నిందితుడి మేనమామ యోహాన్ (35)ను పోలీసులు ఇటీవల అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ క్రమంలో లాకప్‌లో యోహాన్ అనుమానాస్పదంగా మరణించాడు. యోహాన్ మృతదేహంపై గాయాలు ఉండటంతో పోలీసుల విచారణలోనే మరణించాడనే అనుమానాలు మొదలయ్యాయి. అయితే ఇది లాకప్ డెత్ హా? లేకపోతే ఆత్మహత్య చేసుకున్నాడా? అనే విషయం తెలియాల్సి ఉంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల జీజీహెచ్‌కు తరలించారు. యోహాన్ మృతిపై పోలీసులు మాత్రం ఇంకా మౌనంగానే ఉండటం గమనార్హం.
నంద్యాల జిల్లా ముచ్చుమర్రి బాలిక మృతదేహం మిస్సింగ్ మిస్టరీ ఇంకా వీడలేదు. ఈ నెల 9వ తేదీ నుంచి కృష్ణా నదిలో గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ ఆచూకీ దొరకడం లేదు. ఈ నెల 7వ తేదీన పార్క్‌లో ఆడుకుంటున్న 8 ఏళ్ల బాలికను ముగ్గురు మైనర్లు ఎత్తుకెళ్లి అత్యాచారం చేశారు. అనంతరం చంపేసి మృతదేహాన్ని దొరక్కుండా చేశారు. అయితే బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు అదృశ్యం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులకు సంచలన విషయాలు తెలిశాయి. దీంతో ముగ్గురు మైనర్లను అదుపులోకి తీసుకుని విచారించగా బాలిక మృతదేహాన్ని కేసీ కెనాల్ గుట్టపై నుంచి పడేసినట్లు మైనర్లు వెల్లడించారు. ఆ తర్వాత కృష్ణా నదిలో పడేశామని చెప్పారు. వీరికి వారి తల్లిదండ్రులు కూడా సాయపడినట్లు దర్యాప్తులో తెలిసింది. దీంతో ఈ నెల 16న ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
- Tags
- AP News
- muchumarri
- murder
- Nandyala
RELATED ARTICLES
తాజా వార్తలు
Breaking News | ప్రభుత్వానికి షాక్..మూసాపేట, నియోపోలీస్ భూముల వేలం రద్దు
‘దీక్షా దివస్ బహిరంగ సభను జయప్రదం చేయండి’
‘విద్యార్థుల సమగ్ర వికాసంపై శ్రద్ధ చూపాలి’
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి : డీఏఓ వి.బాబురావు
ట్రెండింగ్ వార్తలు
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్ చూపుతూ ప్రపోజ్.. అంతలోనే ఆ రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!

