నిబంధనల ప్రకారమే ఎంపీ రఘురామ ఫోన్ సీజ్ చేశాం : ఏపీ సీఐడీ
నిబంధనల ప్రకారమే సీజ్ చేశాం | నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు ఫోన్‌ను నిబంధనల మేరకే సీజ్ చేశామని సీఐడీ వెల్లడించింది. ఎంపీ రఘురామకృష్ణ రాజు ఏపీ సీఐడీ డీజీ సునీల్ కుమార్‌పై ఢిల్లీ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుపై ఈ మేరకు సీఐడీ విభాగం స్పందించింది.

అమరావతి : నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు ఫోన్‌ను నిబంధనల మేరకే సీజ్ చేశామని ఏపీ సీఐడీ వెల్లడించింది. ఎంపీ రఘురామకృష్ణ రాజు ఏపీ సీఐడీ డీజీ సునీల్ కుమార్‌పై ఢిల్లీ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుపై ఈ మేరకు సీఐడీ విభాగం స్పందించింది. ‘‘సీజ్ చేసిన 90009 22222 నంబరుతో మెసెజ్‌లు పంపారని ఎంపీ ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. కానీ, ఫోన్ సీజ్ చేసినప్పుడు తన నంబరు 90009 11111గా రఘురామ చెప్పారు. ఫోన్లో ఏ నంబరు ఉందో విచారణాధికారికి తెలిసే అవకాశమే లేదు.
ఫోన్‌ను ప్రాథమిక విశ్లేషణ, డేటా, ఫొటోల డంపింగ్‌కు ల్యాబ్‌కు పంపాం. ఫోన్ స్వాధీనానికి సంబంధించిన వివరాలను కోర్టు ముందుంచాం. విశ్లేషన్ చేసిన డేటాను మే 31న గుంటూరు సీఐడీ కోర్టుకు అప్పగించాం. రఘురామ ఫోన్ మే 18 నుంచి ఫోరెన్సిక్ ల్యాబ్ కస్టడీలో ఉంది. కస్టడీలో ఉన్న ఫోన్‌ను అధికారులు వాడే అవకాశం లేదు. ఎంపీ రఘురామ మాపై తప్పుడు అభియోగాలు చేస్తున్నారు’’అని సీఐడీ అధికారులు వివరణ ఇచ్చారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | జపాన్‌లోనూ డార్లింగ్ మానియా .. తెలుగులో విషెస్ చెప్పిన విదేశీ అభిమానులు
Multi Starrer | 40 ఏళ్ల నిరీక్షణకు తెర పడనుందా .. రజినీకాంత్–కమల్ హాసన్‌తో నెల్సన్ భారీ మల్టీస్టారర్!
Scene | సూర్య ‘సీన్’ చిత్రంలో విలన్‌గా నస్లేన్.. గ్లింప్స్ విడుదల!
The Paradise | విమర్శలు ఎదురైన తగ్గేదేలే.. నెట్‌ఫ్లిక్స్‌లో నంబర్ వన్‌గా ‘ది ప్యారడైజ్’, నాని ఖాతాలో మరో రికార్డు!
Shaurya Commandos: శౌర్య కమాండోలను రంగంలోకి దింపిన ఐటీబీపీ
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

