Srisailam | శ్రీశైలం క్షేత్రంలో సామాన్య భక్తులకు మరిన్నీ సదుపాయాలు : ఈవో లవన్న
Srisailam | శ్రీశైలం పుణ్యక్షేత్రంలో సామాన్య భక్తులకు పలు సదుపాయాలను కల్పించేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ కార్యనిర్వహణాధికారి లవన్న ( EO Lavanna) పేర్కొన్నారు.
శ్రీశైలం : శ్రీశైలం(Srisailam) పుణ్యక్షేత్రంలో సామాన్య భక్తులకు పలు సదుపాయాలను కల్పించేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ కార్యనిర్వహణాధికారి లవన్న ( EO Lavanna) పేర్కొన్నారు. ముఖ్యంగా ఉచితంగా మహా మంగళహారతి , వారంలో నాలుగురోజులపాటు ఉచితంగా శ్రీ స్వామివార్ల స్పర్శదర్శనం కల్పిస్తున్నామని వివరించారు. తెల్లరేషన్‌కార్డు కలిగిన వారికి నెలలో ఒకరోజున ఉచితంగా నిర్ధిష్టమైన ఆర్జిత సేవను జరిపించడం, భక్తులకు ఉచితంగా బ్యాటరీ వాహనాల ఏర్పాటు లాంటి చర్యలను తీసుకుంటున్నామని వెల్లడించారు.
మహామంగళహారతికి అవకాశం
సుప్రభాతం, మహామంగళహారతి టికెట్లను నిలుపుదల చేసి మహామంగళహారతి (Mahamangala Harathi) కి సామాన్య భక్తులకు అనుమతిస్తున్నామని ఆయన వివరించారు. సుప్రభాతం, మహామంగళహారతి దర్శనం టికెట్లు, మధ్య దళారీల ప్రమేయం, సిఫారసులు లేకుండా స్వామివారి దర్శనం కల్పిస్తున్నామని వెల్లడించారు. దీని వల్ల ప్రతిరోజు ఉదయం, సాయంత్రం మూడువేల మంది సామాన్య భక్తులకు మహామంగళహారతి దర్శనం కలుగుతుందని వివరించారు.
వారంలో నాలుగురోజులు స్పర్శదర్శనం
వారంలో నాలుగురోజుల పాటు మంగళ, బుధ, గురు, శుక్రవారాల్లో మధ్యాహ్నం 2 గంటలనుంచి శ్రీస్వామివారి స్పర్శదర్శనం (Sparsadarsan) ఉచితంగా చేసుకోవచ్చని ఆయన తెలిపారు. కొత్త విధానం వల్ల ప్రతిరోజు 2,500 మంది స్పర్శదర్శనం చేసుకుంటున్నారని వివరించారు. మే నెల నుంచి అన్నీ ఆర్జిత సేవా టికెట్లు , స్వామివారి స్పర్శదర్శనం టికెట్లను ఆన్లైన్లో ప్రతినెల 25 వ తేదీన ఉంచుతున్నామని వెల్లడించారు. టికెట్ల లభ్యతను బట్టి గంట ముందు వరకు కూడా భక్తులు ఆన్లైన్ ద్వారా ఈ టికెట్లను పొందవచ్చన్నారు. ఈ టికెట్లను మరింత సులభతరంగా పొందేందుకు ఇటీవల దేవస్థానం యాప్‌ను కూడా అందుబాటులోకి తీసుకువచ్చామని ఈవో వివరించారు.
ఉచిత సామూహిక సేవలు
ధర్మప్రచారంలో భాగంగా తెల్లరేషన్‌కార్డు కలిగిన సామాన్య భక్తులు నెలలో ఒకరోజున ఉచిత సామూహిక సేవలను జరిపించుకునే అవకాశాన్నిదేవస్థానం కల్పిస్తుందని తెలిపారు. ప్రతీ నెలలో ఒకరోజున జరుపబడే నిర్ధిష్టసేవలో 250 మంది భక్తులు పాల్గొనవచ్చని, ఈ ఉచిత సామూహిక సేవకు ఆన్లైన్ ద్వారా ముందస్తుగానే పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు.
ఉదయాస్తమానసేవ – ప్రదోషకాల సేవల నిర్వహణ
తగు రుసుము చెల్లించి ఆయా ఆర్జిత సేవలను జరిపించుకునే భక్తుల కోసం ఉదయాస్తమానసేవ – ప్రదోషకాల సేవలను ప్రవేశపెట్టామని దీనివల్ల సామాన్య భక్తులు ఎలాంటి అసౌకర్యం ఉండదని ఆయన తెలిపారు.రెండు ఆర్జిత సేవలలో ఒక్కొక్క సేవకు పరిమితంగా కేవలం ఆరు టికెట్లు మాత్రమే ఇస్తున్నామని వివరించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పింక్ శారీలో శ్రీనిధి శెట్టి పరువాల జాతర.. ఫొటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
US Diwali: అమెరికాలో దీపావళి వేడుకల్ని అడ్డుకున్న అతివాదులు.. వీడియో
TTD Darshan News | తిరుమలలో కొనసాగుతున భక్తుల రద్దీ. శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం
Family suicide | గచ్చిబౌలిలోని ఇంట్లో నుంచి దుర్వాసన.. పోలీసులు వచ్చి చూడగా..
Parkinson’s Disease | పార్కిన్సన్స్ వ్యాధి చికిత్సలో కీలక ముందడుగు.. మూలకణాలతో మెరుగైన ఫలితాలు..
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

