Monkey Pox | ఏపీలో మంకీపాక్స్ కలకలం.. అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం
Monkey Pox | ప్రపంచవాప్తంగా హడలెత్తిస్తున్న మంకీపాక్స్ ఏపీలోనూ కలకలం రేపింది. దుబాయ్నుంచి విజయవాడకు వచ్చిన ఓ చిన్నారికి మంకీపాక్స్ లక్షణాలు ఉన్నట్లు వార్తలు రావడంతో ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది.
Monkey Pox : ప్రపంచవాప్తంగా హడలెత్తిస్తున్న మంకీపాక్స్ ఏపీలోనూ కలకలం రేపింది. దుబాయ్నుంచి విజయవాడకు వచ్చిన ఓ చిన్నారికి మంకీపాక్స్ లక్షణాలు ఉన్నట్లు వార్తలు రావడంతో ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. ఇందుకోసం విజయవాడ కొత్త ప్రభుత్వ ఆస్పత్రిలో ఆరు పడకలతో ఓ వార్డును సిద్ధం చేసింది. అందులో అధునాతన పరికరాలను అందుబాటులో ఉంచింది.
సూపర్‌స్పెషాలిటీ బ్లాక్‌లో ఈ ప్రత్యేక వార్డును ఏర్పాటు చేసినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్డాక్టర్వెంకటేష్తెలిపారు. అన్ని రకాల ఇంజక్షన్లను అందుబాటులో ఉంచామని ఆయన చెప్పారు. ఇప్పటికే భారత ప్రభుత్వం దీనిపై అప్రమత్తమైంది. ఇదిలావుంటే డబ్యూహెచ్వోహెచ్చరికల నేపథ్యంలో ప్రధాని మోదీ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. అన్ని రాష్ట్రాల్లోనూ టెస్టింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని కేంద్రం సూచించింది.
అన్ని విమానాశ్రయాలను అప్రమత్తం చేసి విదేశాల నుంచి వచ్చేవారికి వైద్య పరీక్షలు చేయాలని తెలిపింది. ఇటు తెలంగాణ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. హైదరాబాద్‌లోని గాంధీ, నల్లకుంట ఫీవర్ ఆస్పత్రుల్లో ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేశారు. గాంధీ ఆస్పత్రిలో ఇందుకోసం ప్రస్తుతం 20 పడకలు కేటాయించారు. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంతవరకు ఎలాంటి కేసులు నమోదు కాలేదని అధికారులు చెబుతున్నారు. తాము పూర్తి స్థాయి అప్రమత్తంగా ఉన్నట్టు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అంటున్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కాళేశ్వరాన్ని తిట్టి.. కరువులోకి నెట్టి.. కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే రాష్ర్టానికి దుర్భిక్షం
JIO IPO | దుమ్మురేపిన జియో ఐపీవో.. ముగిసిన మెగా పబ్లిక్ ఇష్యూ.. 22.19 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

