Fact Check | చిరంజీవికి రాజ్యసభ సీటు.. మెగాస్టార్ వివరణ ఇది..
Chiranjeevi | మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. చిరంజీవికి రాజ్యసభ సీటు ఖాయమైందని వస్తున్న వార్తలపై జర్నలిస్టులు గన్నవరం ఎయిర్‌పోర్టులో చిరంజీవిని ప్రశ్నించారు. దీనిపై చిరంజీవి స్పందిస్తూ తనకు

Chiranjeevi | మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. చిరంజీవికి రాజ్యసభ సీటు ఖాయమైందని వస్తున్న వార్తలపై జర్నలిస్టులు గన్నవరం ఎయిర్‌పోర్టులో ఆయనను ప్రశ్నించారు. దీనిపై చిరంజీవి స్పందిస్తూ తనకు రాజ్యసభ సీటు ఇస్తారన్న వార్తలు ఊహాజనితమే అని స్పష్టం చేశారు. రాజ్యసభ సీటు ఇస్తారన్న వార్తలను పూర్తిగా ఖండిస్తున్నాను. అలాంటి ఆఫర్లు తన వద్దకు రావు అని తేల్చిచెప్పారు.
రాజకీయాలకు తాను పూర్తిగా దూరంగా ఉన్నానని పేర్కొన్నారు. రాజకీయాలకు దూరంగా ఉన్న తనకు ఆఫర్లు ఎవరూ ఇవ్వరు అని చిరంజీవి స్పష్టం చేశారు. అలాంటి ఆఫర్లకు తాను అతీతం అని, ఆఫర్లకు లోబడే వ్యక్తిని కాదు అని తెలిపారు. పదవులను కోరుకోవడం తన అభిమతం కాదు అని చిరంజీవి తేల్చిచెప్పారు.
సినీ ఇండస్ట్రీలో నెలకొన్న సమస్యలపై ఏపీ సీఎం జగన్‌తో చర్చించేందుకు చిరంజీవి నిన్న తాడేపల్లికి వచ్చిన విషయం విదితమే. జగన్‌తో సుమారు గంటన్నర పాటు చిరంజీవి చర్చలు జరిపారు. త్వరలోనే సినీ ఇండస్ట్రీలో నెలకొన్న సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని, ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చిరంజీవి స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

