కన్నుల పండువగా శ్రీశైల మల్లన్నరథోత్సవం
శుక్రవారం తొమ్మిదో రోజు ఆలయ అర్చకులు శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లకు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం రథాంగ పూజ, హోమం, బలి కార్యక్రమాలు నిర్వహణ అనంతరం స్వామివారి రథోత్సవం వైభవంగా సాగింది.
శ్రీశైలం : శ్రీశైల క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. శుక్రవారం తొమ్మిదో రోజు ఆలయ అర్చకులు శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లకు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం రథాంగ పూజ, హోమం, బలి కార్యక్రమాలు నిర్వహణ అనంతరం స్వామివారి రథోత్సవం వైభవంగా సాగింది. మేళతాళాల నడుమ స్వామి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను 11 రకాల ప్రత్యేక పుష్పాలతో అలంకరించిన రథంపై అధిష్ఠింజేసి జనసందోహం నడుమ శ్రీశైల పురవీధుల్లో ఊరేగించారు. రథోత్సవంలో భారీగా భక్తులు పాల్గొన్నారు. శివనామస్మరణతో శ్రీశైల క్షేత్ర వీధులు మారుమోగాయి.
పుష్కరిణిలో తెప్పోత్సవం..
ఉత్సవాల్లో భాగంగా స్వామిఅమ్మవార్లకు తెప్పోత్సవం జరిపించారు. విద్యుద్దీప కాంతుల నడుమ పుష్కరిణిలో తెప్పపై ఆదిదంపతులను వీక్షించి భక్తులు తరించారు. అంతకుముందు మంగళ వాయిద్యాలు కళాకారుల నృత్యాల నడుమ ఆలయ రాజగోపురం నుంచి స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను పుష్కరిణి వద్దకు చేర్చి షోడశోపచార క్రతువులు నిర్వహించి పుష్కరిణిలో మూడుసార్లు ప్రదక్షిణలు చేయించారు. కార్యక్రమంలో ఈఓ కేఎస్ రామారావు, ఈఈ మురళీ బాలకృష్ణ, డీఈ నర్సింహాడ్డి, శ్రీనివాసరెడ్డి, పీఆర్ఓ శ్రీనివాసరావు, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ నర్సింహారెడ్డి, అయ్యన్న, రవికుమార్, వెంకటేశ్వరగౌడ్ పాల్గొన్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

