AP news | ఏపీలోని గుంటూరు(Gunturu) జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఓ ప్రేమజంట కోనంకి చెరువు వద్ద ఆత్మహత్యకు (commits suicide)పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే..గుంటూరు జిల్లా కాకుమానుకి చెందిన లావు విఘ్నేష్(19) పదో తరగతి వరకు చదివి నాలుగేళ్లుగా గ్రామంలోనే ఉంటున్నాడు. కాకుమాను మండలం అల్లూరి గ్రామానికి చెందిన బాలిక(16) మండల కేంద్రమైన కాకుమానులో ఓ ప్రైవేట్ స్కూల్లో ప్రస్తుతం పదో తరగతి చదువుతోంది. కాగా, గత కొన్ని నెలలుగా వీరు ప్రేమించుకుంటున్నారు. విషయం పెద్దలకు తెలియడంతో నుంచి ఇంటినుంచి పారిపోయారు.
బుధవారం విఘ్నేష్ తన సోదరికి ఫోన్‌చేసి తాము లోకం విడిచి వెళ్లిపోతున్నామని.. నీవే అమ్మానాన్నలను జాగ్రత్తగా చూసుకోవాల్సిందిగా చెప్పాడు. తమ లొకేషన్‌ను సోదరికి పంపి వెంటనే ఇద్దరూ కలిసి చెరువులోకి దూకారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను బయటకు తీశారు. పోస్టుమార్టం నిమిత్తం మార్టూరు ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.