అంతర్వేదిలో వైభవంగా లక్ష్మీనారసింహుడి కల్యాణం
రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేదిలో శ్రీలక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. వేలాది మంది భక్తులు స్వామి వారి కల్యాణాన్ని తిలకించి పులకించారు. భక్తుల కోసం ఆలయ అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. రథోత్సవం సాఫీగా సాగేందుకు పెద్ద మొత్తంలో పోలీసులను మోహరించారు.
అంతర్వేదిలో లక్ష్మీనరసింహ స్వామి వివాహాన్ని వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజామున 12.35 గంటల నుంచి అర్చకులు వివాహానికి సంబంధించిన క్రతువులను నిర్వహించారు. అంగరంగ వైభవంగా జరిగిన ఈ వివాహాన్ని తిలకించేందుకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ధ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. శనివారం తెల్లవారుజామున సరిగ్గా 12.35 గంటలకు వృచిక లగ్నం, వేదమంత్రాలు, మేళా తాళం, సంప్రదాయ వాద్యాల నడుమ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని పట్టువస్త్రాలతో అలంకరించి కల్యాణం నిర్వహించారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణు గోపాల కృష్ణ, జిల్లా కలెక్టర్ చేవూరి హరికిరణ్, జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఎం రవీంద్రనాథ్ బాబు, రాజోల్ ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్, జాయింట్ కలెక్టర్ సమ్మిట్ కుమార్, ఆర్డీఓ ఎన్ఎస్వీబీ వసంతరాయుడు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ విజయరాజు, ఆలయ కార్యనిర్వహణాధికారి వై భద్రాజీ, అమలాపురం డీఎస్పీ వై మాధవరెడ్డి తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. స్వామి కల్యాణాన్ని తిలకించేందుకు తరలివచ్చే భక్తులకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. తాత్కాలిక బస్ షెల్టర్‌ను ఏర్పాటు చేశారు. కాగా, ఇవాళ మధ్యాహ్నం 2.35 గంటలకు ప్రారంభమయ్యే రథోత్సవానికి ఆలయ అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. రథోత్సవం సజావుగా సాగేందుకు 1,560 మంది పోలీసులను మోహరించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

