komera ankarao | మనుషులకు ఆయువునిచ్చే అడవులకు అండగా మారిన తెలుగోడు
komera ankarao | ప్రకృతి ప్రేమికుడు ఆకులు చేసే గలగల సవ్వడి వినాలనుకుంటాడు. కొండవాగు జలజల తరంగాలు చూడాలని భావిస్తాడు. కానీ, ప్రకృతిని పరిరక్షించే సేవకుడు ఓ సినీకవి సెలవిచ్చినట్టు ‘గలగలమనగూడదు ఆకులలో గాలి.. నిదరోయే కొలను నీరు కదపకూడదు..’ అని తాపత్రయపడతాడు.
komera ankarao | ప్రకృతి ప్రేమికుడు ఆకులు చేసే గలగల సవ్వడి వినాలనుకుంటాడు. కొండవాగు జలజల తరంగాలు చూడాలని భావిస్తాడు. కానీ, ప్రకృతిని పరిరక్షించే సేవకుడు ఓ సినీకవి సెలవిచ్చినట్టు ‘గలగలమనగూడదు ఆకులలో గాలి.. నిదరోయే కొలను నీరు కదపకూడదు..’ అని తాపత్రయపడతాడు. ప్రకృతిని పసిపాపలా కాపాడుకుంటాడు. పల్నాటి సీమకు చెందిన కొమెర అంకారావు ఉరఫ్ జాజి ( Jaji ) అలాంటి వ్యక్తే! పసికూనగా ఉన్నప్పటి నుంచి నల్లమల కానలో కానవచ్చిన అందాలన్నీ చూస్తూ పెరిగాడు. ఆ వనసీమలోనే ఓనమాలు దిద్దుకున్నాడు. అడవిని సొంత తల్లిలా భావించాడు. అందుకే, తనను ఆదరించిన నల్లమల అడవితల్లి ఆదమరచి నిద్దరోవాలని కోరుకుంటాడు. పచ్చగా కళకళలాడాలని దేవుళ్లకు మొక్కుకుంటాడు. ఆ మొక్కులు నెరవేరాలని వేలాది మొక్కలను నాటుతూ కంటికి రెప్పలా కాపాడుతున్నాడు. తన కోర్కెలు తీరాలని జీవితాన్ని నల్లమలకు అంకితం చేశాడు.
నలభై ఏండ్ల జాజి ప్రతిరోజూ ఉదయాన్నే మోపెడ్‌పై అడవిలోకి ప్రవేశిస్తాడు. ఓ చోట బండి ఆపుతాడు. గోనె సంచిని భుజాన వేసుకొని కోన లోపలికి దారితీస్తాడు. కంటికి కనిపించిన ప్లాస్టిక్ వ్యర్థాలను సంచిలో వేసుకుంటాడు. సీసాలు, డబ్బాలు ఏరుతూ పది కిలోమీటర్ల వరకూ తిరుగుతూనే ఉంటాడు. సేకరించిన వ్యర్థాలను చెత్త అమ్ముకునే వ్యక్తులకు ఇచ్చేస్తాడు. ఇలా మనకు రక్షణ కల్పించే అడవి సంరక్షణలో భాగమయ్యాడు జాజి. దాదాపు పాతికేండ్లుగా ఆయన దినచర్య ఇదే!
తొలకరి పలకరించగానే కొత్త ఉత్సాహంతో కదులుతాడు జాజి. కొండలు దాటి అడవి పలుచబడ్డ ప్రాంతాలకు చేరుకుంటాడు. అక్కడ విత్తనాలను వెదజల్లుతాడు. అందులో పండ్ల విత్తులూ ఉంటాయి, ఔషధ మొక్కలకు చెందిన విత్తనాలూ ఉంటాయి. వనదేవతకు అర్చన చేశానన్న భావనతో వాటిని పుడమికి ధారాదత్తం చేస్తాడు. కొన్నాళ్లకు వెళ్లి అవి మొలకెత్తాయో లేదో చూస్తాడు. ఇంకొన్నాళ్ల తర్వాత అవి ఎంత ఎదిగాయో పరిశీలించడానికి వెళ్తాడు. వారంలో ఒక్కరోజు మినహాయిస్తే ఆరురోజులూ అదే పని. ఎదిగిన మొక్కలకు రక్షణ కల్పిస్తాడు. అడవిలో ఒదిగిపోతూ.. నల్లమల ఎదిగేలా నిరంతరం కృషి చేస్తున్నాడు జాజి. దూరమాధ్యమం ద్వారా రెండు పీజీలు చేసిన ఆయన ‘ప్రకృతి పాఠశాల’ పేరుతో పుస్తకాన్ని రాశాడు. దాదాపు ఐదువేల పాఠశాలలకు వెళ్లి ప్రకృతి పరిరక్షణపై విద్యార్థులకు అవగాహన కల్పించాడు. వన సంరక్షణలో జాజి కృషికిగానూ ఎన్నో పురస్కారాలు వరించాయి. తాజాగా ‘ద వీక్’ మ్యాగజైన్ వార్షిక ప్రత్యేక సంచికలో ఈ వనజీవి కథనం ప్రచురితమైంది.
Read More :
“yoganathan |మ్యాన్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికైన యోగనాథన్.. ఎవరీయన!!”
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

