Tirumala | జూలై 9న శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
Tirumala | తిరుమల వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జూలై 9న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు.
తిరుమల : తిరుమల (Tirumala) వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జూలై 9న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. జూలై 16వ తేదీన ఆణివార ఆస్థానం సందర్భంగా ఆలయంలో తిరుమంజనం (Koil Alwar Thirumanjanam ) నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని టీటీడీ (TTD) అర్చకులు తెలిపారు. సంవత్సరంలో నాలుగుసార్లు ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి(Vaikuntha Ekadashi) పర్వదినాల ముందు వచ్చే మంగళవారం రోజున ఆలయ శుద్ధిని నిర్వహిస్తామన్నారు.
శ్రీనివాసమంగాపురంలో వైభవంగా తిరుమంజనం
తిరుపతి : శ్రీనివాసమంగాపురం(Srinivasa Mangapuram) కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జూలై 10 నుంచి 12వ తేదీ వరకు జరగనున్న సాక్షాత్కార వైభవోత్సవాలను పురస్కరించుకుని గురువారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజామున స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి తోమాలసేవ, కొలువు, పంచాంగశ్రవణం నిర్వహించి ఉదయం 6.30 నుంచి 11.30 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం చేపట్టారు.
సాక్షాత్కార వైభవోత్సవాల్లో భాగంగా మూడు రోజులపాటు పలు కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. 10న పెద్దశేష వాహనం, 11న హనుమంత వాహనం, 12న గరుడ వాహనంపై స్వామివారు రాత్రి ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారని తెలిపారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

