శ్రీశైలంలో అర్ధరాత్రి ఉద్రిక్తత.. రణరంగంగా మారిన పురవీధులు
Srisailam | ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయ ఆవరణలో అర్ధరాత్రి ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. చాయ్ దుకాణం దగ్గర జరిగిన గొడవతో ఆలయ పరిసరాలు రణరంగాన్ని తలపించాయి. ఉగాది ఉత్సవాల్లో భాగంగా మల్లన్నను దర్శించుకోవడానికి కర్ణాటక భక్తులు
శ్రీశైలం: ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయ ఆవరణలో అర్ధరాత్రి ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. చాయ్ దుకాణం దగ్గర జరిగిన గొడవతో ఆలయ పరిసరాలు రణరంగాన్ని తలపించాయి. ఉగాది ఉత్సవాల్లో భాగంగా మల్లన్నను దర్శించుకోవడానికి కర్ణాటక భక్తులు శ్రీశైలానికి భారీగా తరలివస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం అర్ధరాత్రి సమయంలో ఓ కన్నడ భక్తుడు చాయ్ తాగేందుకు వెళ్లాడు. దుకాణ యజమానిని తాగడానికి నీళ్లు అడిగాడు. అయితే లేవని చెప్పడంతో ఆ భక్తుడు అతనితో గొడవకు దిగాడు. అది కాస్తా తీవ్రం కావడంతో టీ షాపు యజమాని కన్నడ భక్తుడిపై గొడ్డలితో దాడిచేశాడు. దీంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని దవాఖానకు తరలించారు.

ఇదంతా గమనిస్తున్న తోటి భక్తులు ఆలయ సరిసరాల్లోని షాపులను ధ్వంసం చేశారు. షాపుల్లో వస్తువులను చెల్లాచెదురుగా పడేశారు. కనిపించిన వాహనాలకు నిప్పుపెట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆలయానికి చేరుకున్నారు. శ్రీశైలం వీధుల్లో పెద్దసంఖ్యలో పోలీసును మోహరించారు. గొడవను అదుపులోకి తీసుకొచ్చారు.

దుకాణాలపై దాడులతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. కాగా, గాయపడిన వ్యక్తిని పరామర్శించిన జగద్గురు పీఠాధిపతి.


Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

