KA Paul | విజయసాయిరెడ్డి కొత్త పార్టీపై కేఏ పాల్ ధ్వజం..!
KA Paul | పార్లమెంట్ మాజీ సభ్యుడు విజయసాయిరెడ్డి (Vijayasaireddy) కొత్తగా ఏర్పాటుచేసిన రాజకీయ పార్టీపై ప్రజాశాంతి పార్టీ (Praja Shanti Party) అధ్యక్షుడు కేఏ పాల్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విజయసాయిరెడ్డి పెట్టినపార్టీ 'పరివర్తన పార్టీ' కాదని, అది 'అపరివర్తన అవినీతి పార్టీ' అని ఎద్దేవా చేశారు. దాచుకున్న నల్లధనాన్ని కాపాడుకోవడానికే ఆయన మళ్లీ రాజకీయాల్లోకి వచ్చి కొత్త పార్టీని స్థాపించారని ఆరోపించారు.
KA Paul : పార్లమెంట్ మాజీ సభ్యుడు విజయసాయిరెడ్డి (Vijayasaireddy) కొత్తగా ఏర్పాటుచేసిన రాజకీయ పార్టీపై ప్రజాశాంతి పార్టీ (Praja Shanti Party) అధ్యక్షుడు కేఏ పాల్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విజయసాయిరెడ్డి పెట్టినపార్టీ ‘పరివర్తన పార్టీ’ కాదని, అది ‘అపరివర్తన అవినీతి పార్టీ’ అని ఎద్దేవా చేశారు. దాచుకున్న నల్లధనాన్ని కాపాడుకోవడానికే ఆయన మళ్లీ రాజకీయాల్లోకి వచ్చి కొత్త పార్టీని స్థాపించారని ఆరోపించారు.
గతంలో రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించిన విజయసాయిరెడ్డి ఇప్పుడు అక్రమ సంపాదనను కాపాడుకునేందుకు సరికొత్త వ్యూహంతో ముందుకు వచ్చారని కేఏ పాల్ విమర్శించారు. శ్రీకాకుళం నుంచి హైదరాబాద్ వరకు విస్తరించి ఉన్న ఆయన ఆస్తులను, దోచుకున్న సొమ్మును వెంటనే ప్రభుత్వానికి అప్పగించాలని డిమాండ్ చేశారు. ఇంత భారీగా ఆస్తులు ఉన్నప్పటికీ విజయసాయిరెడ్డి ఆస్తులపై కేంద్ర దర్యాప్తు సంస్థ అయిన సీబీఐ ఎందుకు విచారణ జరపడం లేదని ఆయన ప్రశ్నించారు.
వైసీపీ ఓటు బ్యాంకును దెబ్బతీసేందుకు, ఇతర రాజకీయ శక్తుల కోసం విజయసాయిరెడ్డి ఈ కొత్త పార్టీని ప్రారంభించారని కేఏ పాల్ ఆరోపించారు. రాష్ట్ర రాజకీయాల్లో దశాబ్దాలుగా ఒకే వర్గం ఆధిపత్యం చెలాయిస్తోందని, రాష్ట్రంలో 60 శాతానికి పైగా ఉన్న బీసీలకు, 27 శాతం ఉన్న కాపులకు రాజ్యాధికారం ఎప్పుడు దక్కుతుందని ఆయన ఈ సందర్భంగా నిలదీశారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KA Paul | విజయసాయిరెడ్డి కొత్త పార్టీపై కేఏ పాల్ ధ్వజం..!
BJP MLA Tofazzal Hossain | ప్రజల జీవనశైలిపై బీజేపీ ఎమ్మెల్యే వివాదస్పద వ్యాఖ్యలు.. వెల్లువెత్తిన విమర్శలు
‘వారసత్వ పరిరక్షణకు సమగ్ర కార్యాచరణ’
KTR | రైతులు మంచిగుండాలని కీలక నిర్ణయాలు తీసుకున్న నాయకుడు కేసీఆర్ : కేటీఆర్
Jagdeep Dhankhar | జగదీప్ ధన్‌ఖడ్‌కు అస్వస్థత.. ఎయిమ్స్‌కు తరలింపు..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

