AP High Court | మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి పిటిషన్‌పై తీర్పు రేపటికి రిజర్వ్
AP High Court | పోలింగ్ రోజున తమపై దాడులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ బాధితులు కేసులో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు్ తీర్పు రేపటికి రిజర్వ్ చేసింది.
అమరావతి : పోలింగ్ రోజున తమపై దాడులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ బాధితులు కేసులో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (MLA Pinnelli) వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు్ తీర్పు రేపటికి రిజర్వ్ (Reserve) చేసింది. పల్నాడు జిల్లా మాచర్ల నియోజవర్గం పాల్వాయిగేట్ పోలింగ్ కేంద్రంలో ఈవీఎం(EVM) లను మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి ధ్వంసం చేశారు. అక్కడే ఉన్న టీడీపీ ఏజెంట్(TDP Agent) అభ్యంతరం తెలుపడంతో అతడిపై ఎమ్మెల్యే, అనుచరులు విచక్షణారహితంగా దాడులు చేశారు.
ఈ ఘటన మొత్తం వెబ్‌కాస్టింగ్‌లో నమోదు కావడంతో వాటిని పరిశీలించిన కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా స్పందించి ఎమ్మెల్యేను అరెస్టు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈవీఎం ధ్వంసం కేసులో తనను అరెస్టు చేయవద్దని కోరుతూ ఏపీ హైకోర్టులో ఎమ్మెల్యే ముందస్తు పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ విచారణలో భాగంగా ఇరువాదనలు విన్న హైకోర్టు జూన్ 6వ తేదీ వరకు ఎమ్మెల్యేను అరెస్టు చేయవద్దని షరతులతో కూడిన ఆదేశాలు జారీ చేసింది.
ఈవీఎం ధ్వంసం సమయంలో అడ్డుకున్నందుకు తనపై దాడి చేసి హత్యాయత్నం చేశారని, ఎమ్మెల్యేను అరెస్టు చేయాలని బాధితుడు, పోలింగ్ బయట మహిళపై దుర్భాషలాడడం, మరుసటి రోజు పిన్నెల్లి, ఆయన అనుచరులు కలిసి, సీఐపై దాడికి పాల్పడ్డారు. మూడు ఘటనలపై బాధితులు కేసులు వేయగా ముందస్తు బెయిల్ కోసం పిన్నెల్లి పిటిషన్ దాఖలు చేయగా సోమవారం జరిగిన అనంతరం హైకోర్టు రేపటికి తీర్పును రిజర్వ్ చేసింది .
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

