Red Book | రెడ్‌బుక్ తెరవకముందే జగన్ ఢిల్లీ వెళ్లి గగ్గోలు : మంత్రి నారా లోకేష్
Red Book | ఐదేళ్ల వైసీపీ పాలనలో చట్టాలను చేతుల్లోకి తీసుకొని తప్పు చేసిన వారిని చట్టప్రకారం శిక్షిస్తామన్న మాటకు కట్టుబడి ఉన్నానని ఏపీ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు.
అమరావతి : ఐదేళ్ల వైసీపీ పాలనలో చట్టాలను చేతుల్లోకి తీసుకొని తప్పు చేసిన వారిని చట్టప్రకారం శిక్షిస్తామన్న మాటకు కట్టుబడి ఉన్నానని ఏపీ మంత్రి నారా లోకేష్(Nara Lokesh) స్పష్టం చేశారు. ఇంకా తాను రెడ్‌బుక్(Red Book) తెరవకముందే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్(Jagan) ఢిల్లీ వెళ్లి గగ్గోలు పెడుతున్నారని విమర్శించారు. శుక్రవారం టీడీపీ శ్రేణులు నామినేటెడ్ పదవుల విషయంలో లోకేష్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తప్పు చేసే వారి పేర్లను రెడ్‌బుక్‌లో నమోదు చేస్తున్నానని అనేక సభల్లో చెప్పానని గుర్తు చేశారు. గడిచిన ఐదేండ్లలో జగన్ రెండుసార్లే ప్రెస్మీట్లు పెట్టగా నెలరోజుల వ్యవధిలో ఐదుసార్లు ప్రెస్మీట్లు పెట్టారని ఆరోపించారు. మాజీ సీఎం తాను చెప్పే అబద్ధాలను అసెంబ్లీకి వచ్చి చెబితే వాటిలో నిజానిజాలను తాము ప్రజలకు వివరిస్తామని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో కూటమి నేతలు ఎవరూ వైసీపీ నేతల్లా దూషణలకు దిగరని వివరించారు. పార్టీ కోసం కష్టపడిన వారికి తగిన న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు.
త్వరలో అకాడమిక్ అడ్మిషన్స్ క్యాలెండర్ విడుదల
ఏపీలో అకాడమిక్, అడ్మిషన్స్ క్యాలెండర్(Admission Calender) ను త్వరలో విడుదల చేస్తామని నారా లోకేష్ ప్రకటించారు. శుక్రవారం జరిగిన మండలి సమావేశంలో కళాశాలలు , వర్సిటీల్లో ఉద్యోగాల భర్తీపై సభ్యుల ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాల్లో 5 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని అన్నారు. జూనియర్ కళాశాలల్లో 4,600 , డిగ్రీ కళాశాలల్లో 2,127 పోస్టులు ఖాళీగా ఉన్నాయని వివరించారు. ఆగస్ట్ 5 నాటికి డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలు పూర్తి చేస్తామన్నారు. వర్సిటీలో ఖాళీ పోస్టుల భర్తీపై గవర్నర్‌తో చర్చించామని తెలిపారు.
Read more :
Chandra Babu | వైసీపీ పాలన వల్ల ఏపీకి రూ. 76,795 కోట్ల ఆదాయం తగ్గింది : చంద్రబాబు
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Auto | చెట్లు నాటి తిరిగొస్తుండగా.. టిప్పర్‌ను ఢీకొట్టిన కూలీల ఆటో
DADA | డిసెంబర్ 24న దాదా ధమాకా.. నవంబర్ 13న ఫస్ట్ సాంగ్, థమన్ మ్యూజిక్‌తో టాలీవుడ్లో భారీ హైప్!
iQOO | 10,000mAh బ్యాటరీతో iQOO కొత్త ఫోన్.. 7 ఇంచుల భారీ డిస్ప్లే కూడా!
Rajeev Kanakala | ఎన్టీఆర్ అప్పుడే స్టార్ అవుతాడని చెప్పా, 25 ఏళ్లు గడిచినా మారలేదు.. రాజీవ్ కనకాల ఆసక్తికర వ్యాఖ్యలు!
Dakshinamukhi Anjaneya Swamy | పార్డి (కె) గ్రామంలో ముగిసిన అఖండ హరినామ తాళ సప్తహ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

