Justice NV Ramana | రాజధానికి భూములిచ్చి నేరస్థులుగా కోర్టుల చుట్టూ తిరగడం విచారకరం : జస్టిస్ ఎన్వీ రమణ
Justice NV Ramana | ఆంధ్రప్రదేశ్‌కు అమరావతి రాజధాని కావాలని కోరుతూ భూములిచ్చిన రైతులు కోర్టుల చుట్టూ్ నేరస్థులు గా తిరిగే పరిస్థితి రావడం విచారకరమని సుప్రీంకోర్టు విశ్రాంత సీజే, జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు.
అమరావతి : ఆంధ్రప్రదేశ్‌కు అమరావతి రాజధాని (Amaravati Captial) కావాలని కోరుతూ భూములిచ్చిన రైతులు కోర్టుల చుట్టూ్ నేరస్థులు (Criminals) గా తిరిగే పరిస్థితి రావడం విచారకరమని సుప్రీంకోర్టు విశ్రాంత సీజే, జస్టిస్ ఎన్వీ రమణ (Justice NV Ramana) అన్నారు. కృష్ణా జిల్లా పర్యటనలో భాగంగా గన్నవరం విమానాశ్రయం చేరుకున్న జస్టిస్ ఎన్వీరమణకు అమరావతి రైతులు, మహిళలు, నాయకులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాజధాని రైతులకు న్యాయం జరిగేలా చూడాలని వినతిపత్రం అందజేశారు.
అనంతరం ఎన్వీ రమణ మీడియాతో మాట్లాడారు. దాదాపు 1563 రోజులుగా అమరావతి రైతులు దీర్ఘకాలంగా ఉద్యమాలు(Agitations) చేయడం దక్షిణాధి రాష్ట్రంలో మొట్టమొదటిదని పేర్కొన్నారు. ‘ రైతులు రాజధాని కోసం తమ భూములు త్యాగం చేశారు. రైతుకు, భూమికి ఉన్న సంబంధం తల్లి బిడ్డలకు ఉన్న సంబంధంలాంటిదని ’ పేర్కొన్నారు. అటువంటి పరిస్థితుల్లో భూములు కోల్పోవడం సామాన్య విషయం కాదని అన్నారు.
ఇప్పటికైనా ప్రభుత్వాలు మేల్కొని న్యాయం చేస్తారని, ఆలస్యంగానైనా న్యాయవ్యవస్థ(Courts) లో రైతులకు న్యాయం జరుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. రైతుల ఉద్యయం విజయవంతం కావాలని, విజయవాడ (Vijayawada) లో మంచి రాజధాని నిర్మాణం జరగాలని, రైతుల ఆందోళనకు తగిన ఫలితం లభించాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

