Jogi Ramesh | చంద్రబాబు ఎక్కడికి వెళ్లారు.. దోచుకున్న డబ్బు దాచుకోవడానికి వెళ్లారా?.. మంత్రి జోగి రమేశ్ విమర్శలు
Minister Jogi Ramesh | టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఆరిపోయే దీపం లాంటి వారని, ఏపీలో టీడీపీ అడ్రస్ గల్లంతు కావడం ఖాయమని మంత్రి జోగి రమేష్ ఆరోపించారు.
అమరావతి : టీడీపీ అధినేత చంద్రబాబు ఎక్కడికి వెళ్లారు.. ఏమైపోయారని ఏపీ మంత్రి జోగి రమేశ్ ప్రశ్నించారు. తమ నాయకుడు జగన్ ఎక్కడికి వెళ్తున్నారో చెప్పి వెళ్లారని.. మరి ప్రతిపక్ష నాయకుడు ఎక్కడికి వెళ్లారో ప్రజలకు తెలియజేయాలని అన్నారు. దోచుకున్న డబ్బును దాచుకోవడానికి దుబాయికి వెళ్లారా? అని అనుమానం వ్యక్తం చేశారు. దుబాయి వెళ్లారా? ఇటలీ వెళ్లారా? అమెరికా వెళ్లారా? అని ప్రశ్నించారు. జూన్ 4వ తేదీన కూటమిని ప్రజలు సమాధి చేస్తారని.. త్వరలోనే టీడీపీ అడ్రస్ గల్లంతు అవుతుందని విమర్శించారు.
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఆరిపోయే దీపం లాంటి వారని, ఏపీలో టీడీపీ అడ్రస్ గల్లంతు కావడం ఖాయమని మంత్రి జోగి రమేష్ (Minister Jogi Ramesh) అన్నారు. వైసీపీ (YCP) కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కూటమి నాయకులపై విరుచుకుపడ్డారు. విశ్వాసనీయత, విలువలు ఒకవైపు, కుట్రలు, కుతంత్రాలతో జరిగిన ఎన్నికల్లో ప్రజలు విశ్వాసనీయతపై మొగ్గుచూపారని వెల్లడించారు.
ఎన్నికల్లో కూటమి నాయకులు (Alliance Leaders) ఎన్నికుట్రలు పన్నినా , శాంతి భద్రతలకు విఘాతం కలిగించినా కూడా ప్రజల ఆశీస్సులతో గెలువబోతున్నామని జోస్యం చెప్పారు. జగన్ (YS Jagan) మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారని జాతీయ సర్వే సంస్థలన్నీ వెల్లడిస్తున్నాయని అన్నారు. ఎన్నికల్లో వైసీపీ మంత్రులు, నాయకులు, కార్యకర్తలపై కేసులు పెట్టించినా కూడా ఏపీలో వైఎస్సార్ జెండా రెపరెపలాడ బోతుందని, శ్రేణులు సంబురాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
పల్నాడులో శాంతి భద్రతలను ఖూనీ చేసింది టీడీపీయేనని, ప్రజలను రెచ్చగొట్టింది చంద్రబాబేనని ఆరోపించారు. జూన్ 4న వెలువడే ఫలితాల తరువాత కూటమికి సమాధి తప్పదని అన్నారు. ఇప్పటికే కూటమి అధినేత చంద్రబాబు (Chandra Babu) పారిపోగా, దత్తపుత్రుడు ఏమయ్యాడో తెలియదని, బీజేపీ నాయకులు కనిపించకుండా పోయారని విమర్శించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

