Indrakiladri | కొండచరియలు విరిగి పడుతుండడంతో ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డు మూసివేత
Indrakiladri | పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై అల్పపీడనం కొనసాగుతుండడంతో ఏపీలోని పలు జిల్లాలో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి.
అమరావతి : పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై అల్పపీడనం కొనసాగుతుండడంతో ఏపీలోని పలు జిల్లాలో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. విజయవాడ ( Vijayawada ) లో ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలతో ఇంద్రకీలాద్రి (Indrakiladri) పై కొండరాళ్లు ( Landslides) బుధవారం జారి ఘాట్‌రోడ్ మీద పడ్డాయి . ముందు జాగ్రత్త చర్యగా ఇంద్రకీలాద్రి ఘట్‌రోడ్డును అధికారులు మూసివేశారు.
ఉత్తర కోస్తాంధ్ర ఒడిశా తీరాన్ని ఆనుకుని బలమైన అల్పపీడనం కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలియజేసింది. అల్పపీడనానికి అనుబంధంగా రుతుపవన ద్రోణి, ఉపరితల అవర్తనం ఉందని వెల్లడించింది. దీని వల్ల కోస్తాంధ్ర జిల్లాలో భారీ వర్షాలు, రాయలసీమలో విస్తారంగా వర్షాలు పడే అవకాశముందని ప్రకటించింది. రేపటి నుంచి కోస్తాంధ్ర జిల్లాలో వర్షం పడే అవకాశముందని స్పష్టం చేసింది. అల్లూరి జిల్లా రంపచోడవరం మన్యంలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి.
మన్యం జిల్లాలో కొండవాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. దేవీపట్నం మండలం సుక్కరాతి గండి వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. భూపతిపాలెం జలాశయం 5 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | అధిష్టానాన్ని దిక్కరించి అభ్యర్థిని ప్రకటించుకున్న టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి
IND vs WI | భారత్-వెస్టిండీస్ ఐదో టీ20 వర్షార్పణమేనా..?
AI | ఏఐపై అతిగా ఆధార పడుతున్న యువత.. మానసిక ఆరోగ్యం దెబ్బ తింటుందని నిపుణుల హెచ్చరిక..
Help Desk | పట్టభద్రుల ఎన్రోల్మెంట్ హెల్ప్‌డెస్క్ ప్రారంభం
‘ఉపాధి కోసం వ్యక్తిగత రుణాలను సద్వినియోగం చేసుకోవాలి’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

