తిరుమలలో పెరుగుతున్న భక్తుల రద్దీ
Tirumala | తిరుమలలోని శ్రీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో స్వామిదర్శనం చేసుకుంటే ఎంతో పుణ్య మని భావించే భక్తులు తిరుమల కొండకు చేరుకుంటున్నారు. దీంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరుగు తుంది. నిన్న స్వామివారి 52,682 మంది భక్తులు దర్శించుకోగా
తిరుమల : తిరుమలలోని శ్రీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో స్వామిదర్శనం చేసుకుంటే ఎంతో పుణ్య మని భావించే భక్తులు తిరుమల కొండకు చేరుకుంటున్నారు. దీంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరుగు తుంది. నిన్న స్వామివారిని 52,682 మంది భక్తులు దర్శించుకోగా 15,805 మంది తలనీలాలు సమర్పిం చుకు న్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 5.57 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు. కాగా ఇవాళ తిరుమలలోని అన్ని కంపార్ట్ మెంట్లు భక్తులతో కిటకిట లాడుతున్నాయి.
శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరిగే తొమ్మిది రోజులు విధుల్లో ఏ మాత్రం అలసత్వం ప్రదర్శించ వద్దని టీటీడీ ఈవో ఎ వి ధర్మారెడ్డి టీటీడీ భద్రతా సిబ్బందికి సూచించారు. లక్షలాదిగా వచ్చే భక్తులతో సహనంతో , స్నేహ పూర్వకంగా ప్రవర్తించాలని చెప్పారు. తిరుమల ఆస్థాన మండపంలో టీటీడీ భద్రతా సిబ్బందితో సమావేశ మయ్యారు. సిబ్బంది పోలీసు శాఖతో సమన్వయం చేసుకోవాలన్నారు. క్రమశిక్షణ తో పని చేసి టీటీడీ కి మంచి పేరు తేవాలని సూచించారు. భక్తుల భద్రత విషయంలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

