ఏపీలో మరో మూడు రోజులు వానలకు అవకాశం: ఐఎండీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 4.5 కి.మీ వరకు విస్తరించి..
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 4.5 కి.మీ వరకు విస్తరించి ఉన్నందున మంగళవారం నుంచి మరింత పెరిగే అవకాశం ఉన్నది. ఈ మేరకు అమరావతిలోని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అధికారులు ప్రకటన విడుదల చేశారు. రానున్న మూడు రోజుల్లో కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వారు పేర్కొన్నారు.
బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు కోస్తాంధ్రలో పలుచోట్ల, రాయలసీమలో ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు వైఎస్ఆర్ కడప జిల్లా సింహాద్రిపురంలో అత్యధికంగా 8.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవగా, ఎచ్చెర్లలో 7.6, మనుబోలులో 7.4, మారేడుమిల్లిలో 6.1, బాలాయపల్లిలో 5.8, విజయవాడ, గుడివాడలో 5.3, రావికమతంలో 4.6, రావికమతంలో 4.6 సెం.మీ. పెదకూరపాడు, మామిడికుదురు, బుక్కపట్నం, నూజివీడులో 4.4 సెం.మీ. వర్షం కురిసింది. ప్రజలు అవసరం ఉంటేనే ఇళ్లు విడిచి బయటకు రావాలని అధికారులు విజ్ఞప్తిచేస్తున్నారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకుండా ఇంటిపట్టునే ఉండాలని సూచిస్తున్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

