ఏపీ వైపు దూసుకొస్తున్న అసని తుఫాన్.. ఉత్తర కోస్తాంధ్రపై తీవ్ర ప్రభావం
Cyclone Asani | అసని తుఫాన్ (Cyclone Asani) ఆంధ్రప్రదేశ్ వైపునకు దూసుకొస్తున్నది. ఇప్పటికే తీవ్ర తుఫానుగా మారిన అసని.. పశ్చిమమధ్య బంగాళాఖాతం సమీపానికి చేరుకున్నది. ప్రస్తుతం పోర్ట్‌బ్లెయిర్‌కు వాయవ్య దిశగా 570 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నది.
హైదరాబాద్: అసని తుఫాన్ (Cyclone Asani) ఆంధ్రప్రదేశ్ వైపునకు దూసుకొస్తున్నది. ఇప్పటికే తీవ్ర తుఫానుగా మారిన అసని.. పశ్చిమమధ్య బంగాళాఖాతం సమీపానికి చేరుకున్నది. ప్రస్తుతం పోర్ట్‌బ్లెయిర్‌కు వాయవ్య దిశగా 570 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నది. రేపు రాత్రికి ఉత్తర కోస్తాంధ్ర, ఒడిశా తీరం సమీపానికి వచ్చే అవకాశం ఉన్నది. దీని ప్రభావంతో కోస్తాంధ్రలో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు, ఉత్తర కోస్తాంధ్ర, ఒడిశాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ వెల్లడించింది.

తుఫాను ప్రభావంతో తీరంలో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నదని, మత్య్సకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది. తీరానికి దగ్గరగా వచ్చిన తర్వాత దిశ మార్చుకుని బెంగాల్ వైపు పయణిస్తుందని తెలిపింది.
అయితే అసని తుఫాన్ బెంగాల్ వైపు వెళ్లినా.. ఏపీ తీరంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశమున్నదని వాతావరణ శాఖ వెల్లడించింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం పార్వతీపురం, విశాఖపట్నం, అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి జిల్లాలపై తుఫాన్ ప్రభావం ఉండనుందని అంచనా వేస్తున్నది. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

