హనుమంత వాహనంపై కోదండరాముని అలంకారంలో దర్శనం
అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజైన బుధవారం ఉదయం హనుమంత వాహనంపై కోదండరాముడి అలంకారంలో స్వామివారు దర్శమిచ్చారు. మంగళవాయిద్యాలు, భజనలు, కోలాటాల నడుమ ఆలయ మాడ వీధుల్లో...
తిరుపతి : అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజైన బుధవారం ఉదయం హనుమంత వాహనంపై కోదండరాముడి అలంకారంలో స్వామివారు దర్శమిచ్చారు. మంగళవాయిద్యాలు, భజనలు, కోలాటాల నడుమ ఆలయ మాడ వీధుల్లో కోలాహలంగా వాహనసేవ జరిగింది.
హనుమంతుడు భగవత్ భక్తులలో అగ్రగణ్యుడు. రామాయణంలో మారుతి స్థానం అద్వితీయం. చతుర్వేద నిష్ణాతుడుగా, నవవ్యాకరణ పండితుడిగా, లంకాభీకరుడిగా ప్రసిద్ధిచెందాడు. గురుశిష్యులైన శ్రీరామ హనుమంతులు తత్త్వ వివేచనగావించిన మహనీయులు కనుక వీరిని దర్శించిన వారికి వేదాలతత్త్వం ఒనగూరుతుంది.
మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకు పుణ్యాహవచనం, వసంతోత్సవం నిర్వహించారు. రాత్రి 8 నుండి 9 గంటల వరకు గజ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో కంకణబట్టార్ సూర్యకుమార్ ఆచార్యులు, సూపరింటెండెంట్ శ్రీమతి శ్రీవాణి, టెంపుల్ ఇన్స్పెక్టర్ శివకుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

