Gun misfire | బీడీఎల్‌లో గన్ మిస్‌ఫైర్ .. సీఐఎస్ఎఫ్ జవాను మృతి
Gun misfire | సంగారెడ్డి జిల్లా బీడీఎల్ భానూరులో ఘోరం జరిగింది. ఓ జవాన్ బస్సు దిగుతుండగా చేతిలో గన్ మిస్ ఫైర్ తలలోంచి దూసుకెళ్లింది.
సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లా బీడీఎల్ భానూరులో ఘోరం జరిగింది. ఓ జవాన్ బస్సు దిగుతుండగా చేతిలో గన్ మిస్ ఫైర్(Gun misfire ) తలలోంచి దూసుకెళ్లింది. దీంతో జవాన్ ( Jawan ) అక్కడికక్కడే మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి. కర్నూలు(Kurnool) జిల్లా అవుకు మండలం జూనూతల గ్రామానికి చెందిన వెంకటేశ్(Venkatesh) (34) కొన్ని సంవత్సరాలుగా సంగారెడ్డిలోని బీడీఎల్(BDL) భానూరులో సీఐఎస్ఎఫ్ (CISF) జవాన్‌గా పనిచేస్తున్నాడు.
శనివారం మధ్యాహ్నం ఆయన బస్సు దిగుతుండగా ఒక్కసారిగా ప్రమాదవశాత్తు చేతిలోని తుపాకి పేలి తూటా తలలోకి దూసుకెళ్లింది. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడని అధికారులు తెలిపారు. ఘటన విషయాన్ని సమాచారం అందించడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. జవాన్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

