తిరుపతి: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన శనివారం ఉదయం పల్లకీపై మోహినీ అలంకారంలో శ్రీ అలమేలు మంగ అమ్మవారు భక్తులకు అభయమిచ్చారు. కరోనా నేపథ్యంలో ఆలయం వద్దగల వాహన మండపంలో ఉదయం 8 నుంచి 9 గంటల వరకు పల్లకీ ఉత్సవం ఏకాంతంగా నిర్వహించారు. అమ్మవారి మోహినీ అవతారం భౌతికంగా జగన్మోహకత్వాన్నీ, ఆధ్యాత్మికంగా మాయాతీతశుద్ధ సత్త్వస్వరూప సాక్షాత్కారాన్ని ఏక సమయంలోనే సిద్ధింపజేస్తోంది.
ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, చంద్రగిరి ఎమ్మెల్యే డా.చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, జెఈఓ వీరబ్రహ్మం, ఆలయ డిప్యూటీ ఈవో కస్తూరిబాయి, ఏఈవో ప్రభాకర్ రెడ్డి,పాంచరాత్ర ఆగమసలహాదారు శ్రీనివాసాచార్యులు, అర్చకులు బాబుస్వామి, సూపరింటెండెంట్లు శేషగిరి,మధుసుదన్, ఏవిఎస్వో వెంకటరమణ, టెంపుల్ ఇన్స్పెక్టర్ రాజేష్ కన్నా తదితరులు పాల్గొన్నారు.