Stab | ప్రియురాలిని 15సార్లు కత్తితో పొడిచి చంపిన ప్రియుడు..!
Stab | కర్ణాటక బెంగళూరులో దారుణ ఘటన చోటు చేసుకున్నది. నగరంలోని మురుగేష్పల్యలో ఓ యువతిని యువకుడు కత్తితో దాడి చేసి చంపాడు. మృతురాలిని ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడకు చెందిన లీలా పవిత్ర నీలమణి (25)గా గుర్తించారు.
Stab | కర్ణాటక బెంగళూరులో దారుణ ఘటన చోటు చేసుకున్నది. నగరంలోని మురుగేష్పల్యలో ఓ యువతిని యువకుడు కత్తితో దాడి చేసి చంపాడు. మృతురాలిని ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడకు చెందిన లీలా పవిత్ర నీలమణి (25)గా గుర్తించారు. ఘటన తర్వాత నిందితుడిని పోలీసులు అరెస్టు చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లీలా పవిత్ర ఓ కంపెనీలో పని చేస్తున్నది. విధులు ముగించుకొని రాత్రి 7.30 గంటల ప్రాంతంలో కార్యాలయం నుంచి బయటకు వచ్చింది.
అప్పటికే అక్కడే ఉన్న దినకర్ బాణాల (28) అనే యువకుడు కత్తితో పవిత్రపై దాదాపు 15 సార్లు దాడి చేయడంతో తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో విలవిల్లాడుతూ మృతి చెందింది. ఆ తర్వాత సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని నిందితుడిని అరెస్టు చేశారు. లీలా పవిత్ర ఎంఎస్సీ వరకు చదివింది. హెల్త్‌కేర్ మేనేజ్మెంట్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్స్‌లో ఉద్యోగం చేస్తున్నది. శ్రీకాకుళానికి చెందిన దినకర్ తోమలూరులోని హాస్టల్లో ఉంటూ ఓ హెల్త్ కేర్ కంపెనీలో పని చేస్తున్నాడు. లీలా పవిత్ర, దినకర్ ఇద్దరు గత ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.
కొద్ది నెలల కొందట పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకోగా.. ఇద్దరి కులాలు వేరుకావడంతో కుటుంబ సభ్యులు వ్యతిరేకించారు. ఆ తర్వాత లీలా పవిత్ర దినకర్‌ను దూరం పెట్టింది. అలాగే పలుసార్లు దినకర్ ఫోన్ చేసేందుకు ప్రయత్నించగా.. స్పందించ లేదు. దీంతో కక్ష్య పెంచుకున్న దినకర్ పక్కా ప్రణాళికతో పవిత్ర పని చేస్తున్న ఆఫీసు వద్ద వచ్చాడు. కార్యాలయం నుంచి బయటకు రాగానే కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. దాంతో యువతి అక్కడికక్కడే మృతి చెందింది. జీవన్ బీమానగర్ పోలీసులు దినకర్‌ను అదుపులోకి తీసుకొని, హత్య కేసు నమోదు చేశారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prashanth Neel | భయపెట్టేందుకు వస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’.. ఆసక్తికరంగా ట్రైలర్!
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Govt Land | ఐదెకరాల సర్కార్ స్థలంపై డేగ కన్ను.. రాత్రికి రాత్రే ఆ భూమిలో బోర్లు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
ట్రెండింగ్ వార్తలు
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!

