Excise policy | ఏపీలో నూతన ఎక్సైజ్ పాలసీ అమలు కోసం నాలుగు బృందాల ఏర్పాటు
Excise policy | ఏపీలో అమలులో ఉన్న మద్యం విధానం మారనుంది. కొత్త పాలసీని తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నహాలు చేస్తుంది.
అమరావతి : ఏపీలో అమలులో ఉన్న మద్యం విధానం ( New Excise Policy) మారనుంది. కొత్త పాలసీని తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నహాలు చేస్తుంది. ఇందుకోసం ఆరు రాష్ట్రాల్లో అధ్యయనం కోసం నాలుగు బృందాలను(Four Teams) ఏర్పాటు చేసింది. నాటి వైసీపీ ప్రభుత్వం(YCP Government) మద్యం కొనుగోలు, విక్రయాల్లో అనేక అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని, జే బ్రాండ్ (J Brand) తో నాణ్యత లేని మద్యాన్ని సరఫరా చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుకున్నారని కూటమి నేతలు ఆరోపించారు.
మద్యం, ఇసుక, నేరాలపై తీవ్రస్థాయిలో ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన కూటమి రాష్ట్రంలో నూతన ఎక్సైజ్ పాలసీని తీసుకురానున్నది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన నాలుగు బృందాలు తెలంగాణ(Telangana) , కర్ణాటక, ఉత్తర ప్రదేశ్(Utterpradesh) , రాజస్థాన్, కేరళ , తమిళనాడులో ఉన్న మద్యం పాలసీని స్టడీ చేసి నివేదికను ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.
ఒక్కో బృందంలో ముగ్గురేసి సభ్యులు ఆయా రాష్ట్రాలకు వెళ్లి అధికారులను సంప్రదించి వివరాలు తెలుసుకుని ఈ నెల 12 వ తేదీలోగా నివేదికలు ఇవ్వనున్నారు. మద్యం షాపులు, మద్యం కొనుగోళ్లు, ధరలు, నాణ్యత, డిజిటల్ పేమెంట్లపై సమగ్రంగా వివరాలు తెలుసుకోనున్నారు. నివేదికలు అందిన తరువాత సెప్టెంబర్ చివరి వారం నాటికి గాని, అక్టోబర్ మొదటి వారం నుంచి గాని నూతన ఎక్సైజ్ పాలసీని అమలులోకి తీసుకురానున్నారు.
Read more :
Somireddy Chandramohan Reddy | అవినీతిపై చంద్రబాబు ర్యాంకులు ప్రకటిస్తే.. సోమిరెడ్డికే ఫస్ట్ ర్యాంక్.. మాజీ మంత్రి కాకాణి సంచలన వ్యాఖ్యలు
Lakshmi Parvati | ఏపీలో లక్ష్మీపార్వతికి ఆ పోస్టు కూడా ఊస్టింగ్
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

