Anna Lezhneva | పవన్ కళ్యాణ్ మూడో భార్య గురించి ఈ విషయాలు మీరెప్పుడూ విని ఉండరు..!
Anna Lezhneva | తెలుగు సూపర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి ఏకంగా డిప్యూటీ సీఎం కావడంతో ఆయన కుటుంబం గురించి ఇప్పుడు ఆసక్తికర చర్చ జరుగుతోంది. ముఖ్యంగా పవన్ సతీమణి అన్నా లెజినోవా గురించి, వారి పిల్లల గురించి పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అన్నా లెజినోవా ఎక్కడ పుట్టారు..? పవన్‌కు ఎలా పరిచయమ్యారు..? వారి పరిచయం పెళ్లిదాకా ఎలా వెళ్లింది..? తదితర విషయాలపై ఇంటరెస్టింగ్ కథానాలు మీడియాలో వస్తున్నాయి.
Anna Lezhneva : తెలుగు సూపర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి ఏకంగా డిప్యూటీ సీఎం కావడంతో ఆయన కుటుంబం గురించి ఇప్పుడు ఆసక్తికర చర్చ జరుగుతోంది. ముఖ్యంగా పవన్ సతీమణి అన్నా లెజినోవా గురించి, వారి పిల్లల గురించి పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అన్నా లెజినోవా ఎక్కడ పుట్టారు..? పవన్‌కు ఎలా పరిచయమ్యారు..? వారి పరిచయం పెళ్లిదాకా ఎలా వెళ్లింది..? తదితర విషయాలపై ఇంటరెస్టింగ్ కథానాలు మీడియాలో వస్తున్నాయి.
పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ గత ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిలో భాగంగా 21 అసెంబ్లీ స్థానాలు, రెండు లోక్‌సభ స్థానాల్లో పోటీచేసింది. ఒక్క స్థానంలో కూడా ఓటమి అనేదే లేకుండా అన్ని చోట్ల ఆ పార్టీ విజయఢంకా మోగించింది. దాంతో తాజాగా చంద్రబాబు ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్‌కు డిప్యూటీ సీఎం పదవి దక్కింది. తాజాగా ఆయనకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి పదవి కట్టబెట్టారు. ఆంధ్రప్రదేశ్‌లో ఆయన పార్టీ రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది. కేంద్రంలో ప్రధాని మోదీ దగ్గర కూడా పవన్ పలుకుబడి పెరిగింది.
ఎన్నికల్లో ఘన విజయం అనంతరం కార్యకర్తలతో కలిసి సంబరాలు చేసుకుని ఇంటికి చేరుకున్న పవన్ కళ్యాణ్‌కు ఆయన భార్య అన్నా లెజినోవా హిందూ సంప్రదాయ రీతిలో ఇంట్లోకి స్వాగతం పలికారు. హారతి పళ్లెంతో పవన్‌కు ఎదురొచ్చారు. అనంతరం నుదుట కుంకుమ బొట్టు పెట్టారు. ఆ తర్వాత హారతిచ్చి ఇంట్లోకి తీసుకెళ్లారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో అన్నా లెజినోవా గురించి పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
పవన్, లెజినోవా ఎలా ఒక్కటయ్యారు..?
అన్నా లెజినోవా 1980 లో రష్యాలో జన్మించారు. ఆమె రష్యాలో నటిగా, మోడల్‌గా రాణించారు. ఈ క్రమంలో 2011లో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘తీన్మార్’ సినిమాలో లెజినోవాకు ఒక చిన్నపాత్ర దక్కింది. ఈ సినిమా షూటింగ్ సందర్భంగా ఇద్దరికి పరిచయం పెరిగి ప్రేమలో పడ్డారు. ఈ ఆన్సెట్ ప్రేమాయణం పెళ్లికి దారితీసింది. రెండేళ్లపాటు డేటింగ్ చేసిన అనంతరం 2013 సెప్టెంబర్ 30న పవన్, లెజినోవాలు పెళ్లి చేసుకున్నారు.
పవన్, లెజినోవా దంపతులకు ఇద్దరు పిల్లలున్నారు. కుమార్తె పేరు పోలెనా అంజనా పవనోవా, కొడుకు పేరు మార్క్ శంకర్ పవనోవిచ్. వీరిలో అంజనా పవనోవా.. అన్నా లెజినోవా మొదటి వివాహం ద్వారా జన్మించింది. శంకర్ పవనోవిచ్ మాత్రం పవన్, లెజినోవాల సంతానం. అయితే అంజనా పవనోవాను పవన్ కళ్యాణ్ దత్తత తీసుకున్నారు. ఇప్పుడు పిల్లలిద్దరూ కలిసే పెరుగుతున్నారు.
అయితే, అన్నా లెజినోవా కేవలం మోడలింగ్ కేరీర్‌తో మాత్రమే సరిపెట్టుకోలేదని, సింగపూర్‌లో ఆమెకు హోటల్స్ ఉన్నాయని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. లెజినోవాకు రష్యా, సింగపూర్‌లో భారీగా ఆస్తులున్నాయని కూడా రూమర్స్ వెల్లువెత్తుతున్నాయి. ఆమె ఆస్తుల విలువ దాదాపుగా రూ.1,800 వందల కోట్లు ఉంటుందని ప్రచారం జరుగుతోంది.
అన్నా లెజినోవాను వివాహం చేసుకున్న అనంతరం పవన్ కళ్యాణ్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. అప్పటికే ఆయన రెండు పెళ్లిళ్లు చేసుకుని విడాకులు తీసుకోవడం, తర్వాత మూడో పెళ్లి చేసుకోవడంపై చాలామంది విమర్శలు గుప్పించారు. పవన్ కళ్యాణ్ 1997లో 19 ఏళ్ల నందినిని వివాహం చేసుకున్నారు. 2008లో వారు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత 2009లో పవన్ కళ్యాణ్ నటి రేణు దేశాయ్‌ని రెండో వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు పిల్లలు అకీరా నందన్, ఆధ్యా ఉన్నారు. అయితే 2012లో రేణు దేశాయ్‌కి కూడా పవన్ డైవోర్స్ ఇచ్చారు.
ఇదిలావుంటే మూడో భార్య అన్నా లెజినోవాతో కూడా పవన్ కళ్యాణ్‌కు అభిప్రాయ బేధాలు వచ్చాయని, ఇద్దరు విడిగా ఉంటున్నారని ఇటీవల జోరుగా ప్రచారం జరిగింది. నాగబాబు కొడుకు వరుణ్‌తేజ్ ఎంగేజ్మెంట్కు గానీ, చిరంజీవి మనుమరాలు.. రామ్‌చరణ్, ఉపాసనల కుమార్తె ఊయల ఫంక్షన్కుగానీ అన్నా లెజినోవా రాకపోవడం, పవన్ కళ్యాణ్ ఒక్కరే హాజరవడం ఈ ప్రచారానికి బలం చేకూర్చింది. ఈ నేపథ్యంలో లెజినోవా ఎన్నికల సందర్భంగా తన భర్తతో కలిసి ప్రజల్లోకి వచ్చారు. భర్తకు మద్దతుగా నిలిచి ఆయన ఘన విజయంలో పాలుపంచుకున్నారు. దాంతో తనకు, తన భర్తకు మధ్య గొడవలు ఉన్నాయని జరుగుతున్న ఉత్తదేనని చెప్పకనే చెప్పారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

