Fire Accident | ఏపీలోని పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. అర్ధరాత్రి సమయంలో రామా టాకీస్‌లో మంటలు చెలరేగాయి. దీంతో థియేటర్ దగ్ధమైంది.
అగ్ని ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలు అదుపులోకి తీసుకొచ్చారు. అయితే సుమారు రూ.70 లక్షల మేర ఆస్తి నష్టం కలిగిందని నిర్వాహకులుచెబుతున్నారు.