11న ఏపీలో మంత్రి వర్గ ప్రమాణానికి విస్తృత ఏర్పాట్లు
Arrangements| ఆంధ్రప్రదేశ్‌లో మూకుమ్మడిగా రాజీనామా చేసిన మంత్రుల స్థానంలో కొత్త మంత్రి వర్గం ప్రమాణ స్వీకారానికి ఏపీ
అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో మూకుమ్మడిగా రాజీనామా చేసిన మంత్రుల స్థానంలో కొత్త మంత్రి వర్గం ప్రమాణ స్వీకారానికి ఏపీ ఉన్నతాధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 11న సచివాలయంలోని అసెంబ్లీ పార్కింగ్ స్థలంలో ప్రమాణ స్వీకారానికి కావాల్సిన ఏర్పాట్లను ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ సంబంధిత శాఖల అధికారులతో వర్చువల్‌గా సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. పరిసర ప్రాంతాల్లో పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎస్ ఆదేశించారు.
ప్రమాణ స్వీకారం అనంతరం గవర్నర్, ముఖ్యమంత్రితో నూతన మంత్రివర్గ సభ్యులతో గ్రూపు ఫోటో, వేదిక, అలంకరణ, ఆహ్వాన పత్రిక, రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి, మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న వారికి ఆహ్వానం పలకడం, రవాణా సౌకర్యం ఏర్పాట్లను ప్రోటోకాల్ విభాగం పర్యవేక్షిస్తోంది. ఏపీ సీఎం జగన్ ఆదేశాల మేరకు మంత్రివర్గంలో ఉన్న మొత్తం 24 మంది మంత్రులు నిన్న తమ రాజీనామా పత్రాలను అందజేశారు.
పాత మంత్రివర్గంలో ఉన్న వారిలో అయిదుగురు లేదా ఆరుగురిని కుల, మత, ప్రాంతీయ సమీకరణల మేరకు కొనసాగిస్తారని భావించినప్పటికీ అనుభవం దృష్ట్యా మరికొంత మందికి తిరిగి అవకాశం కల్పించనున్నారని సమాచారం. మొత్తంగా ప్రస్తుతం ఏర్పాటు చేయనున్న మంత్రివర్గంలో అధికభాగం కొత్తవారికి అవకాశం దక్కనుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramagundam Thermal Plant | రామగుండం ప్లాంట్‌పై పూటకో మాట.. రెండున్నరేళ్లుగా తేలని నిర్ణయం!
Cyberabad Police | పోలీసు గస్తీకి సుస్తీ.. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో దందాలు, సెటిల్ మెంట్లతో ఖాకీలు బిజీ!
Horoscope | 21-10-2026 బుధవారం.. మీ రాశి ఫలాలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

