ప్రధానికి వరద నష్టాన్ని వివరిస్తా : ఏపీ సీఎం
Flood damage|ఇటీవల ఆంధ్రప్రదేశ్లోని గోదావరి పరివాహక ప్రాంతాల్లో వచ్చిన వరదల వల్ల జరిగిన నష్టాన్ని ప్రధాని నరేంద్ర మోదీని
అమరావతి : ఇటీవల ఆంధ్రప్రదేశ్లోని గోదావరి పరివాహక ప్రాంతాల్లో వచ్చిన వరదల వల్ల జరిగిన నష్టాన్ని ప్రధాని నరేంద్ర మోదీని కలిసి వివరిస్తానని ఏపీ సీఎం జగన్ తెలిపారు. ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం తిరుమలాపురంలో వరద బాధిత గ్రామాల్లో్ పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వరద నష్టానికి సంబంధించిన ఫొటో గ్యాలరీని పరిశీలించారు. అనంతరం గ్రామస్థులనుద్దేశించి ఆయన మాట్లాడారు.
ప్రధాని మోదీ అపాయింట్మెంట్ను కోరానని, ఈసారి భేటిలో పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా మార్చినందున ముంపు గ్రామాలకు ఇచ్చే ఆర్థిక ప్యాకేజీని,వరద నష్టాన్ని త్వరగా ఇవ్వాలని గట్టిగా కోరుతానని జగన్ వెల్లడించారు. వరదల వల్ల ఇళ్లు కోల్పోయిన వారికి రూ. 10వేలు పరిహారం ఇవ్వాలని అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు. వరదలతో నష్టపోయిన ప్రతి ఒక్కరినీ ఆదుకుంటా మని అన్నారు. వరద నష్టంపై అంచనాలు రూపొందించాలని అధికారులను ఆదేశించామని వెల్లడించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

