అమరావతి : ఉక్రెయిన్‌లో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల కోసం ఏపీ సర్కార్ ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్లను ఏర్పాటు చేసింది. విద్యార్థుల సౌకర్యార్ధం ఈ మెయిల్, వాట్సఫ్ నంబర్లను ప్రభుత్వం వెల్లడించింది. ఏపీఎన్ఆర్టీఎస్ వెబ్సైట్ ద్వారా సంప్రదించవచ్చని సూచించింది. వీటితో పాటు 24 గంటల హెల్ప్‌లైన్ నంబర్ 0863 2340678 , వాట్సప్ నంబర్ 85000027678 అనే నంబర్ల ద్వారా సంప్రదించవచ్చని ఏపీ అధికారులు తెలిపారు.