విశాఖ జిల్లాలో ఎదురు కాల్పులు : ఆరుగురు మావోయిస్టులు మృతి.!
ఆరుగురు మావోయిస్టులు మృతి.! | విశాఖ-తూర్పుగోదావరి సరిహద్దులోని కొయ్యూరు మండలం తీగమెట్ట వద్ద ఈ తెల్లవారుజామున గ్రేహాండ్స్ దళాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం.

అమరావతి : విశాఖ-తూర్పుగోదావరి సరిహద్దులోని కొయ్యూరు మండలం తీగమెట్ట వద్ద ఈ తెల్లవారుజామున గ్రేహాండ్స్ దళాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో ఎవరు చనిపోయారు, ఎంతమందికి గాయాలయ్యాయి తదితర వివరాలు సేకరించడంలో ఆలస్యమవుతున్నదని పోలీసులు చెబుతున్నారు. కాల్పుల్లో చాలామంది నక్సల్స్‌కు, పోలీసులకు సైతం గాయాలైనట్లు తెలిసింది. ఘటనాస్థలంలో ఏకే-47 తుపాకులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఘటనాస్థలానికి పోలీసుశాఖ అదనపు బలగాలను పంపుతున్నట్లు వినికిడి. మావోయిస్టు అగ్రనేతలు తప్పించుకున్నారన్న సమాచారం మేరకు పోలీసులు అటవీ ప్రాంతాన్ని గాలిస్తున్నారు. కొయ్యూరు మండలం మంప పోలీసు స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో ఈ తెల్లవారుజామున గ్రేహాండ్స్ దళాలు కూంబింగ్ నిర్వహిస్తుండగా తీగమెట్ట వద్ద మావోయిస్టులు తారసపడటంతో ఎదురుకాల్పులు జరిగాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arunachal Anti-Dam Protest | డ్యామ్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. కార్యాలయం, పలు వాహనాలకు నిప్పు
ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు
Talasani srinivas Yadav | పట్టభద్రులు అందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్
Swayambhu | విజువల్ ఎఫెక్ట్స్ పనులు.. నిఖిల్ ‘స్వయంభూ’ విడుదల మరింత ఆలస్యం!
NZvIND: ఇండియా టార్గెట్ 181
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

