యువకుడి ఆత్మహత్య.. కారణం వాట్సాప్ సందేశం
వాట్సాప్ గ్రూపులో షేర్ చేసిన మెసేజ్‌తో స్నేహితుల మధ్య చెలరేగిన ఘర్షణ ఒక యువకుడు ఆత్మహత్యకు కారణమైంది. స్నేహితులతో గొడవ కారణంగా తీవ్ర మానసిక క్షోభకు గురైన సదరు యువకుడు ఆత్మహత్య...
విజయనగరం : వాట్సాప్ గ్రూపులో షేర్ చేసిన మెసేజ్‌తో స్నేహితుల మధ్య చెలరేగిన ఘర్షణ ఒక యువకుడు ఆత్మహత్యకు కారణమైంది. స్నేహితులతో గొడవ కారణంగా తీవ్ర మానసిక క్షోభకు గురైన సదరు యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. బై ఫ్రెండ్స్ అంటూ వాట్సాప్ స్టేటస్ పెట్టి రైలు కింద దూకి చనిపోయాడు. ఈ ఘటన విజయనగరం జిల్లాలో ఆదివారం చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
దుప్పాడ గ్రామానికి చెందిన తాళ్లపూడి త్రినాథ్ (24) వీటీ అగ్రహారంలోని ప్రియా సిమెంట్స్‌లో సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. కొంత కాలం క్రితం గ్రామానికి చెందిన యువకులంతా కలిసి వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకున్నారు. ఈ గ్రూప్‌లోని కొన్ని మెసేజ్‌లకు సంబంధించి వచ్చిన అనుమానాస్పద గొడవల కారణంగా త్రినాథ్ తీవ్ర మానసిక క్షోభకు గురయ్యాడు. ఈ గొడవలపై వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదైంది. దీంతో అతడు మరింత మనస్తాపానికి గురైనాడు. ఆదివారం ఉదయం 8.50 గంటలకు వాట్సాప్‌లో ‘బై ఫ్రెండ్స్’ అంటూ స్టేటస్ సందేశం పంపి 9 గంటలకు సికింద్రాబాద్-భువనేశ్వర్ విశాఖ ఎక్స్‌ప్రెస్ కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.
అలకానంద కాలనీకి సమీపంలోని రైల్వే ట్రాక్ పక్కన నిలిపిన బైక్‌ను బట్టి మృతుడు దుప్పాడ వాసి తాళ్లపూడి త్రినాథ్‌గా గుర్తించారు. మృతుడికి తల్లి గౌరమ్మ, తండ్రి అప్పారావు ఉన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు జీఆర్పీ ఎస్సై రవివర్మ తెలిపారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నీళ్లులేక ఎండిన పంటలు.. జయశంకర్ జిల్లాలో యువరైతు వినూత్న నిరసన : వీడియో
CM’s Vigilance Cell Officer | సీఎం విజిలెన్స్ సెల్ అధికారి.. హోటల్ రూమ్‌లో మృతి
Narayanpet | నారాయణపేటలో కొట్టుకున్న బీఎస్పీ- కాంగ్రెస్ నాయకులు
ప్రేమ వేధింపులకు యువతి బలి ?
Sukhbir Badal | బీజేపీతో పొత్తు ఉండొచ్చు.. ఆప్, కాంగ్రెస్‌లు ప్రత్యర్థులే.. శిరోమణి అకాళిదళ్ నేత సుఖ్బీర్ సింగ్
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

