Minister Payyavula | అనంతపురంలో ప్రబలుతున్న అతిసారం.. నివేదిక కోరిన మంత్రి పయ్యావుల
Minister Payyavula | ఏపీలోని అనంతపురం జిల్లాలో ప్రభలుతున్న అతిసారం కేసులపై మంత్రి పయ్యావుల కేశవ్ అధికారుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమరావతి : ఏపీలోని అనంతపురం జిల్లాలో ప్రభలుతున్న అతిసారం(Diarrhea) కేసులపై మంత్రి పయ్యావుల కేశవ్ (Minister Payyavula) అధికారుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే నివేదిక అందించాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. అనంతపురం గుత్తి మండలం రజాపురం అంబేద్కర్ గురుకుల బాలికల పాఠశాలలో 60 మంది విద్యార్థులు (Students) అతిసారం బారిన పడ్డారు. బాధిత విద్యార్థులను వెంటనే ఆస్పత్రుల్లో చేర్పించి వైద్య చికిత్సలు అందజేస్తున్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ఆహార తనిఖీ సంచాలకుల ఆదేశాలతో అధికారులు గ్రామంలో పర్యటించి తనిఖీలు చేపట్టారు. తాగునీరు, ఆహార పదార్థాలు, వంట నూనె తదితర సరకుల నమూనాల సేకరించారు. హాస్టల్లో వంటకు వినియోగించే కిరాణా సరకుల నమానాలను సేకరించి ల్యాబ్(Lab)కు పంపనున్నట్లు ఆహార తనిఖీ అధికారి తస్లిం వెల్లడించారు.
ఉరవకొండ మండలం చిన్నముస్టూరులో అతిసారంతో ఇటీవల వృద్ధుడు మృతి చెందడంపై కూడా అధికారులు వాకబు చేశారు. ఉరవకొండ నియోజకవర్గ వ్యాప్తంగా జ్వరాలు ప్రబలుతుండడం, ఎక్కువ శాతం మంది డయేరియా లక్షణాలతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

