తిరుమలకు పోటెత్తిన భక్తులు.. దర్శనానికి 24 గంటల సమయం
Tirumala crowd| తిరుమల కొండపై భక్తులు పోటెత్తారు. వరుస సెలవులు, తమిళుల పెరాటసి మాసం సందర్భంగా శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో
తిరుమల : తిరుమల కొండపై భక్తులు పోటెత్తారు. వరుస సెలవులు, తమిళుల పెరాటసి మాసం సందర్భంగా శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు రావడంతో తిరుమలలోని అన్ని కం పార్టు మెంట్లు నిండిపోయాయి. వీరికి 24 గంటల్లో దర్శనం అవుతుందని టీటీడీ అధికారులు వెల్లడించా రు.
వైకుంఠం-2 , నారాయణగిరి షెడ్లు భక్తులతో నిండిపోగా శిలాతోరణం వద్దకు భక్తులు సర్వదర్శనం కోసం నిలిచియున్నారు. దర్శన సమయాలను దృష్టిలో పెట్టుకుని భక్తులు తిరుమలకు రావాలని , కంపార్టు మెంట్లు, క్యూ లైన్లో ఉన్న భక్తుల కోసం తాగునీరు, అల్పహారం,చిన్నపిల్లలకు పాలు అందజేస్తున్నామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు.

వాహనం బేరర్లకు ఒక్కొక్కరికి రూ. 81,500 కానుకగా అందజేత
బ్రహ్మోత్సవాల్లో విధులు నిర్వహించిన వాహనం బేరర్లు, మేళం సిబ్బంది, వేదపారాయణదారులు, జియ్యంగార్ల శిష్య బృందం, పారిశుద్ధ్య కార్మికులు మొత్తం 2500 మంది సిబ్బందికి టీటీడీ కానుకలను వస్త్రబహుమానం అందజేశారు. వాహన బేరర్లకు ప్రత్యేకంగా రూ.64.50 లక్షలను వాహనం బేరర్లకు కానుకగా అందించారు. ఒక్కో వాహనం బేరర్ కు రూ.81,500 కానుకగా అందించారు. తొమ్మిది రోజుల పాటు మలయప్ప స్వామి వివిధ వాహనాలపై ఊరేగిన సందర్భంగా వాటిని మోసిన బేరర్లకు కానుకగా అందజేశారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

