Brahmotsavam | సింహ వాహనంపై యోగ నరసింహస్వామి దర్శనం
Brahmotsavam |అప్పలాయగుంట ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో మూడోరోజు బుధవారం స్వామివారు శ్రీ యోగ నరసింహస్వామి అలంకారంలో సింహ వాహనం పై భక్తులకు దర్శనమిచ్చారు.
తిరుపతి : అప్పలాయగుంట ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ( Brahmotsavam) మూడోరోజు బుధవారం స్వామివారు శ్రీ యోగ నరసింహస్వామి అలంకారంలో సింహ వాహనం (Simhavahanam) పై భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా మంగళవాయిద్యాలు, భజనలు, కోలాటాల నడుమ ఆలయ మాడ వీధుల్లో కోలాహలంగా వాహనసేవ జరిగింది.
సాయంత్రం 5.30 నుంచి 6:30 గంటల వరకు ఊంజల సేవ, రాత్రి 7 నుంచి 8 గంటల వరకు ముత్యపు పందిరి వాహనంపై స్వామివారు విహరించనున్నారు. వాహనసేవలో ఏఈవో రమేష్, సూపరింటెండెంట్ వాణి, కంకణ భట్టర్ సూర్య కుమార్ ఆచార్యులు, టెంపుల్ ఇన్స్పెక్టర్ శివకుమార్ పాల్గొన్నారు.
శ్రీవారి ఆదాయం రూ. 5.41 కోట్లు
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. స్వామివారి దర్శనం కోసం వచ్చిన భక్తులతో కంపార్టుమెంట్లు నిండిపోయి కృష్ణతేజ గెస్ట్‌హౌజ్ వరకు క్యూలైన్లో నిలబడ్డారు. టోకెన్లు లేని భక్తులకు 20 గంటల్లో సర్వదర్శనం (Sarvadarsan) కలుగుతుందని అర్చకులు తెలిపారు. నిన్న స్వామివారిని 75,125 మంది భక్తులు దర్శించుకోగా 31,140 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం(Hundi Income) రూ. 5.41 కోట్లు వచ్చిందని టీటీడీ ఆలయ అధికారులు వెల్లడించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
Revanth Reddy | సాగుకు చుక్కనీరూ ఇవ్వలేను.. తాగునీళ్లూ లేవు.. వచ్చే 10 నెలలూ ఇంతే.. చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి
Horoscope | 24-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

