AP News | వైసీపీ మాజీ ఎంపీ ఎంవీవీకి మరో షాక్.. వైజాగ్‌లో క్రిమినల్ కేసు నమోదు
AP News | విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణపై క్రిమినల్ కేసు నమోదైంది. హయగ్రీవ భూముల వ్యవహారంలో ఎంవీవీపై ఈ కేసు నమోదు చేశారు. ఎంవీవీతో పాటు ఆడిటర్ గన్నమనేని వెంకటేశ్వరరావు, రియల్టర్ గద్దె బ్రహ్మాజీపైనా వైజాగ్ పోలీసులు కేసు నమోదు చేశారు.
AP News | విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణపై క్రిమినల్ కేసు నమోదైంది. హయగ్రీవ భూముల వ్యవహారంలో ఎంవీవీపై ఈ కేసు నమోదు చేశారు. ఎంవీవీతో పాటు ఆడిటర్ గన్నమనేని వెంకటేశ్వరరావు, రియల్టర్ గద్దె బ్రహ్మాజీపైనా వైజాగ్ పోలీసులు కేసు నమోదు చేశారు.
ఎండాడలో సీనియర్ సిటిజన్స్ హౌసింగ్ కోసం 2010లో హయగ్రీవకు 12.51 ఎకరాలను కేటాయించారు. అయితే ఎంవోయూ పేరిట ఖాళీ పత్రాలపై సంతకాలు తీసుకున్నారని మాజీ ఎంపీ ఎంవీవీపై హయగ్రీవ డెవలపర్ చిలుకూరి జగదీశ్ అరిలోవ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తనను బెదిరించి నకిలీ పత్రాలు సృష్టించారని.. విలువైన భూములను కాజేసేందుకు కుట్రలు పన్నారని ఆరోపించారు. దీంతో జగదీశ్ ఫిర్యాదు మేరకు మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణపై ఈ నెల 22న నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దీనిపై ఏపీ హైకోర్టులో ఎంవీవీ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.
ఎంవీవీ సత్యనారాయణకు ఇటీవల జీవీఎంసీ కూడా షాకిచ్చింది. అశీల్మెట్ టైకూన్ కూడలి దగ్గర సీబీసీఎన్సీ స్థలంలో జరుగుతున్న ఎంవీవీ పీక్ వెంచర్ పనులపై స్టాప్ వర్క్ ఆర్డర్ ఇచ్చింది. విశాఖ నగర నడిబొడ్డున వందల కోట్ల రూపాయల విలువ చేసే 4.5 ఎకరాల స్థలంలో ప్రతిష్టాత్మకంగా నిర్మాణాలు చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ స్థలంలో ఉన్న రాళ్లను తొలగించేందుకు నిర్మాణ సంస్థ పేలుడు పదార్థాలను వినియోగిస్తుంది. దీనివల్ల సమీప భవనాల పునాదులు దెబ్బతింటున్నాయని స్థానికులు జీవీఎంసీకి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే జీవీఎంసీ స్టాప్ వర్క్ ఆర్డర్ జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు పనులను నిలిపివేయాలని ఆదేశించింది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mahabubnagar | ప్రైవేట్ భూముల్లో వీడియోలు.. రేవంత్ రెడ్డి అనుచరుడికి దేహశుద్ది
Bathukamma | లండన్‌లో ఘనంగా ‘టాక్-చేనేత బతుకమ్మ-దసరా’ సంబరాలు
Shahid Afridi: షాహిద్ అఫ్రిది మృతిచెందినట్లు సోషల్ మీడియాలో ఫేక్ పోస్టు
Bathukamma Celebrations | ఫ్రిస్కో నగరంలో అంబరాన్నంటిన ‘టి-ప్యాడ్’ బతుకమ్మ సంబరాలు .. ప్రత్యేక ఆకర్షణగా నవీన్ పోలిశెట్టి
Chinmay Sutar: చరిత్ర సృష్టించిన మిజోరం బ్యాటర్.. చిన్మయ సుతార్ 400 నాటౌట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

