ఏపీలో విద్యుత్ ఛార్జీల పెంపుపై రేపటి నుంచి సీపీఐ నిరసనలు..
Protests| ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ ఛార్జీల పెంపుపై సీపీఐ నాయకులు ఆందోళనకు సిద్ధం అవుతున్నారు. రేపటి నుంచి వరుస నిరసనలకు పిలుపునిచ్చినట్లు
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ ఛార్జీల పెంపుపై సీపీఐ నాయకులు ఆందోళనకు సిద్ధం అవుతున్నారు. రేపటి నుంచి వరుస నిరసనలకు పిలుపునిచ్చినట్లు సీపీఐ ఏపీ నాయకుడు రామకృష్ణ వెల్లడించారు. ఇంటి పన్ను, చెత్తపన్ను పెంచి ప్రజలను ఇబ్బందుల పాలు చేస్తున్న వైసీపీ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను పెంచి నడ్డి విరుస్తుందని ఆరోపించారు.
రాష్ట్రంలో విద్యుత్ కేటగిరిలను రద్దు చేసి 13 శ్లాబ్‌లను ఆరుకు కుదించారని విమర్శించారు. ప్రజలపై విద్యుత్ ఛార్జీలు మోపడం అన్యాయమని దీనిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఏడాదిలో ఇచ్చే పథకాల డబ్బూ పెంచిన విద్యుత్ బిల్లులకే సరిపోదని నారా లోకేశ్ తెలిపారు. టీడీపీ హయాంలో విద్యుత్ ఛార్జీలు పెంచకపోయినా తప్పుడు ఆరోపణలు చేసిన జగన్ క్షమాపణలు చెప్పాలని, విద్యుత్ ఛార్జీల పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించు కోవాలని డిమాండ్ చేశారు. ఉచిత విద్యుత్‌పై మాటతప్పి మోటార్లకు మీటర్లు బిగించారని ఆరోపించారు. ఎమ్మెల్సీ అశోక్‌బాబు మాట్లాడుతూ విద్యుత్ రంగానికి సంబంధించి అరాచక పాలన చేస్తున్నారని విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యుత్ చార్జీలను పెంచింది. 30 యూనిట్ల వరకు యూనిట్‌కు 45 పైసలు, 31 నుంచి 75 యూనిట్ల వరకు యూనిట్‌కు 91 పైసలు పెంచారు. 76 నుంచి 125 యూనిట్ల వరకు యూనిట్‌కు రూ. 1.40 పైసలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 126 నుంచి 225 యూనిట్ల వరకు రూ. 6 లు, 226 నుంచి 400 యూనిట్ల వరకు యూనిట్‌కు రూ. 8.75 పైసలు , 400 యూనిట్లకు పైగా ఉన్నవాటికి యూనిట్‌కు రూ. 9.75 పైసలు ప్రభుత్వం ఛార్జీలను పెంచింది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్‌లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

